నా సినిమాలకు ఎప్పటికీ హైక్స్ ఉండవు: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Movies Ticket Hikes Ranabaali Release

ఇప్పుడు హీరోలు/నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ టైమ్ కి.. ఎంత కుదిరితే అంత టికెట్ హైక్ తీసుకొని, ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని దోచుకుంటుంటే.. విజయ్ దేవరకొండ ఒక సెన్సిబుల్ డెసిషన్ తీసుకున్నాడు. తన సినిమాలకి ఎప్పటికీ టికెట్ హైక్స్ ఉండవు అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

రణబాలి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ.. తన కాలేజ్ డేస్ లో ప్రసాద్ ఐమాక్స్ లో టికెట్ రేట్ 80/- రూపాయల నుండి 100/- రూపాయలకి పెంచితేనే చాలా కోప్పడ్డాడట. రోజుకి 10 రూపాయలు సేవ్ చేసుకుని, సినిమాకి వెళ్లే నేను.. 20/- రూపాయలు పెంచితేనే హర్ట్ అయ్యాను, అలాంటిది ఇప్పుడు నేను నా సినిమాలకి టికెట్ హైక్ తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

ఎప్పుడైనా మరీ రాజమౌళితో సినిమా చేస్తే తప్ప.. తన సినిమాలకి టికెట్ హైక్స్ ఉండకూడదు అని నిర్మాతలతో అగ్రిమెంట్ టైంలోనే రూల్ ఫిక్స్ చేసుకుంటానని చెప్పాడు విజయ్.

ఇకపోతే.. ఓవర్సీస్ లో ఇవాళ అన్నీ పాసులు ఎనేబుల్ చేసారు. మరి ఆ ప్రభావంతోనైనా బుకింగ్స్ ఏమైనా పుంజుకుంటాయేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories