Telugu

సినిమా పోయినా…దర్శకుడు సేఫ్!

తొలిప్రేమ సినిమాతో మంచి హిట్ కొట్టాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇక తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా ఈ దర్శకుడు చేసిన MR మజ్ను సినిమా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అంటే ఈ లెక్కన అఖిల్ కెరీర్ లో మరో డిజాస్టర్ అన్న మాట.

అయితే అసలే కుర్ర దర్శకుడు. ఈ సినిమా హిట్ అయితేనే మరో సినిమా అవకాశం వచ్చే రోజులు ఇవి. ఈ సినిమా ఫ్లాప్ తో ఏ దర్శకుడికి మళ్ళీ కష్టాలు తప్పవేమో అని అనుకున్నారు అందరూ. కానీ యువ హీరోలు అందరూ ఈ దర్శకుడుతో సినిమా చెయ్యడానికి సిద్ధం అయిపోతున్నారని టాక్.

ADVERTISEMENT

ఇప్పటికే యువ హీరో విజయ్ దేవరకొండ ఈ దర్శకుడితో సినిమా చెయ్యడానికి సిద్ధం అయిపోగా, మరో పక్క యువ హీరోలు నితిన్, అక్కినేని చైతూ కూడా ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అట. చైతూ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ మంచి కథతో వస్తే తప్పకుండ సినిమా చేస్తా అని చెప్పాడట.

ఇక విజయ్ దేవరకొండ ఇప్పటికే తాను వెంకీతో సినిమా చేస్తున్నట్లు నిర్దారించాడు కూడా. మొత్తంగా చూసుకుంటే సినిమా పోయినా, దర్శకుడు మాత్రం సేఫ్ అన్న మాట బలంగా వినిపిస్తుంది మన టాలీవుడ్ వర్గాల నుంచి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Amitabh Bachchan Stunned by Sai Pallavi?

Sai Pallavi says playing Sita in Ramayana is a special experience, as she sees the…

9 minutes ago

Jailer 2’s 1000 Crore Dream Crashed: Who Is to Blame?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…

24 minutes ago