
తమిళనాడు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు టీవీకే అధినేత దళపతి విజయ్ కు మరింత అనుకూలంగా మారుతున్నాయి. 108 సీట్లతో తమిళనాడులో అతి పెద్ద రాజకీయ పార్టీగా నిలబడిన టీవీకే పార్టీకి గవర్నర్ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం లేదని, ఇదంతా విజయ్ పై జరుగుతున్న రాజకీయ కుట్ర అనే భావన తమిళనాడు ప్రజలలో బలంగా వినిపిస్తుంది.
విజయ్ ను సీఎం పదవికి దూరం చేసేందుకే బడా రాజకీయ పార్టీలు తెరచాటు రాజకీయాలు సాగిస్తూ విజయ్ సీఎం ప్రమాణస్వీకారాన్ని ఆపుతున్నాయని, ఇది అప్రజాస్వామ్యమంటూ ఇప్పటికే కొన్ని గొంతులు గళం విప్పాయి. ఇక విజయ్ ఇంటి ముందు ఆయన అభిమానులు విజయ్ ను సీఎం కాకూండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ రేపు విజయ్ కి మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా నిరశన కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చింది. అలాగే ఇటు సోషల్ మీడియాలో సైతం విజయ్ కి అనుకూలంగా మద్దతు పెరుగుతుంది. రాజకీయాలలో అల్టిమేట్ గా గెలుపే అంతిమ లక్ష్యం అని కానీ విజయ్ విషయంలో గెలుపు చివరి పేజీ కాలేదనే విషయం స్పష్టమవుతుంది.
డబ్బులేని రాజకీయం, సామాన్యుడికి అధికారం అన్నట్టుగా సాగిన విజయ్ టీవీకే రాజకీయం దేశానికే ఆదర్శమని, అటువంటి వారి పైన ఇటువంటి రాజకీయ కుయుక్తులా అంటూ సోషల్ మీడియాలో విజయ్ కి అనుకూలంగా ప్రచారం ఊపందుకుంది.
అటు తమిళ ప్రజలలో కూడా విజయ్ పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన రాజకీయ జీవితం పై ఎన్నో కుట్రలు జరిగాయని, ఆయన వ్యక్తిగత జీవితం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయని అయినా విజయ్ వేటికి తలవంచకుండా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లినప్పటికీ ఇంకా విజయ్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారంటూ తమిళ ప్రజలు గవర్నర్ నిర్ణయం పై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రాజకీయాలలో ‘గెలుపు అనేదే చివరి పేజీ కాదని’, గెలుపుతోనే అసలు రాజకీయం ఏంటో విజయ్ కళ్ళారా చూస్తున్నారని, ఇక నుంచి తన పొలిటికల్ డైరీలో విజయ్ కి ప్రతి పేజీ మొదటి పేజీ కానుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
YS Jagan is possibly one of the very few politicians in India, who is completely…
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 will miss its October 9 release. Producer Naga Vamsi confirmed…