ఎలక్షన్స్ క్లోజ్… సినిమా ఓపెన్?

Vijay in Jana Nayagan movie still amid release delay after Tamil Nadu elections

నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు పడడం, సెలబ్రిటీలందరూ ఓట్లు వేయడానికి ముందుకు రావడం అనేది విజయ్ కోసమేనని చాలామంది అంటున్నారు. అయితే.. ఫలితం ఏమిటి అనేది మే 4న తెలిసిపోతుంది.

ఎన్నికల ఫలితాలకంటే కంటే కూడా తమిళ యువత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం “జన నాయగన్” ఇప్పటికైనా రిలీజ్ అవుతుందా లేదా అనేదే. ఎన్నికల ముందు సినిమా సెన్సార్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాం. ఇప్పటికే సెన్సార్ అవ్వలేదు. రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా తెలీదు.

ADVERTISEMENT

అయితే.. సినిమా HD ప్రింట్ అది క్కూడా మంచి DI & సౌండ్ మిక్సింగ్ చేసిన కాపీ లీక్ అవ్వడం అనేది హల్ చల్ చేసింది. లీక్ కి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ.. సినిమా మొత్తం లీక్ అవ్వడం అనేది అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టిన విషయం. తమ అభిమాన కథానాయకుడి ఆఖరి సినిమాని థియేటర్లో చూడాలని ఆశపడిన చాలామందికి ఈ లీక్ అనేది మింగుడుపడలేదు.

ఇక నిన్నటితో ఎలక్షన్స్ పూర్తవ్వడంతో ఇప్పటికైనా “జన నాయగన్”ను విడుదల చేస్తే బాగుండు అని విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాకపోతే.. ఎలక్షన్స్ అయిపోయినా ఎలక్షన్ కోడ్ అనేది రిజల్ట్స్ డిక్లరేషన్ వరకు అమల్లో ఉంటుంది కాబట్టి “జన నాయగన్” రిలీజ్ అనేది లాజికల్ గా కష్టమే. ఎందుకంటే.. పక్క పార్టీల వారిని లేదా నాయకుల్ని తప్పుగా మాట్లాడినా, అపహాస్యం చేసినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి.

సో, విజయ్ ఫ్యాన్స్ కి తమ హీరో ఆఖరి సినిమాను థియేటర్లలో చూడడానికి ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories