Telugu

నాడు చిరు వద్దన్నది..రజని తప్పుకున్నది ఇందుకేనా.?

వెండితెర మీద 100 మందిని ఒంటి చేత్తో అవలీలగా చితక్కొట్టగలిగిన స్టార్ హీరో నిజ జీవితంలో ఒత్తిడులను తట్టుకోలేక ఎంత నిస్సహాయుడిగా మారతాడో అనేదానికి నాటి మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ జర్నీ, అలాగే మరో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన, ఇక ఇప్పుడు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి.

తెలుగు రాష్ట్రాలలో దశాబ్దాల పాటు టాలీవుడ్ లో నెంబర్ 1 గా వెలుగొందిన చిరు 2008 ఆగస్టు 26 న “ప్రజారాజ్యం”తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవే మెయిన్ టార్గెట్ గా బరిలోకి దిగిన చిరు ప్రజారాజ్యం చివరికి 18 సీట్లతో సరిపెట్టుకుంది.

ADVERTISEMENT

ఇలా మొదలైన చిరు రాజకీయ ప్రయాణం మూడేళ్లకే మూన్నాళ్ళ ముచ్చటగా 2011 ఫిబ్రవరి లో కాంగ్రెస్ పార్టీలో విలీనంతో తన అవతారాన్ని చాలించింది. ఈ మూడేళ్ళ సమయంలో పార్టీ ఆవిర్భావం పార్టీ అంతిమ యాత్ర అన్ని జరిగిపోవడానికి ముఖ్య కారణం రాజకీయ ఒత్తిడులను తట్టుకోలేకపోవడమే.

సినిమాలో డైలాగ్స్ చెప్పి ఫాన్స్ తో విజిల్స్ కొట్టించుకున్న ఈజీ గా ప్రజా జీవితంలో ఓటర్ల నుంచి ఓట్లు సాధించలేమని, వెండితెర మీద ఫైట్లతో విలన్లను చితకబాదినంత సులువుగా నిజ జీవితంలో పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కోలేమనే వాస్తవాన్ని తొందరగా గ్రహించిన మెగాస్టార్ ఈ రంగానికి తానూ సెట్ కానని రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి సినీ ఇండస్ట్రీలోకి తిరిగొచ్చేశారు.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికొస్తే 2017 న తన పొలిటికల్ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించిన రజని ఆ తరువాత మూడేళ్ళ సమయం తీసుకుని మరి “మక్కల్ సివై కట్చి” అంటూ తన రాజకియ పార్టీ పేరుని ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో తమిళ రాజకీయాలలో పెను మార్పులు ఖాయం అంటూ దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.

కానీ పార్టీ పేరు ప్రకటించిన కొన్ని రోజులకే ఆరోగ్య కారణాల దృష్ట్యా తానూ రాజకీయాలలోకి రాలేకపోతున్నానంటూ మరో ప్రకటన చేసి తన అభిమానులకే కాదు తమిళ రాజకీయాలకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు రజని. అయితే ఆయన ఈ ప్రకటన వెనుక చిరు పార్టీ విలీనం వెనుక సినీ నటులు మోయలేని రాజకీయ ఒత్తిడులు కారణం అనేది బహిరంగ సత్యమే.

ఇక ఇప్పుడు తనవంతు అంటూ విజయ్ ముందుకు రావడంతో, దళపతికి సినిమా కష్టాలు కాదు ఏకంగా సీరియల్ కష్టాలే మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరి 2 న దళపతి విజయ్ “తమిళగ వెట్టిరి కజగం” (TVK) అంటూ తన రాజకీయ పార్టీ పేరుని ప్రకటిస్తూ తమిళ రాజకీయాలను మరోసారి దేశ వ్యాప్త చర్చకు తెచ్చారు.

2026 తమిళనాడులో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి టార్గెట్ గా రాజకీయం మొదలు పెట్టారు. అయితే ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా ఆయన పొలిటికల్ జర్నీ మొదలవ్వగానే TVK చుట్టూ రాజకీయ వివాదాలు, విజయ్ కి వ్యక్తిగత సమస్యలు మొదలయాయ్యి.

2025 సెప్టెంబర్ లో కరూర్ లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట కారణంగా సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన TVK పార్టీకి కోలుకోలేని రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. పార్టీ పెట్టిన మొదట్లోనే పార్టీ పై ఇటువంటి వివాదం విజయ్ పొలిటికల్ జర్నీ లో ఎన్నటికీ చేరుపుకోలేని మచ్చగా మిగిలిపోయింది.

అలాగే దానిఫలితంగా విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని కూడా సీబీఐ విచారణతో మొదలుపెటాల్సి వచ్చింది. ఇక తన పొలిటికల్ ఎంట్రీ తో జననాయకన్ సినిమాతో తన ఇన్నేళ్ల సినీ జీవితానికి ఎగ్జిట్ చెప్పారు దళపతి. అలాగే ఆ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ ఇప్పటికి అది సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంటు ఎప్పుడు థియేటర్లలలోకి వస్తుందో కూడా చెప్పలేని సందిగ్థ పరిస్థితిలో కొట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మరోపక్క విజయ్ పై ఐటీ రైడ్లు, ఆయన వ్యక్తిగత జీవితం మీద అక్రమ సంబంధాల చర్చలు,

ఇక విజయ సతీమణి నుంచి విడాకుల నోటీసులు ఇలా విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సమస్యల పద్మవ్యూహంలో చిక్కుపోయారు. అయితే ఈ పద్మవ్యూహం వెనుక కూడా రాజకీయ ఒత్తిడులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనేది దళపతి అభిమానుల వాదన.

సినీరంగంలో ఉన్న ఇన్నేళ్ళలో ఎన్నడూ ఎదుర్కొని వివాదాలు, ఎప్పుడు మోయని నిందలు, ఎప్పుడు రాని వైవాహిక సమస్యలు ఒక్క ప్రకటనతో చుట్టుముట్టేశాయి. మరి ఈ రాజకీయ, వ్యక్తిగత సమస్యల పద్మవ్యూహం నుంచి విజయ్, జనసేన పవన్ మాదిరి బయటపడతారా.? లేదా చిరు, రజని మాదిరి లొంగిపోతారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CBN And PK Active, But Where Is YS Jagan?

The stage is being set for the upcoming local body election in Andhra Pradesh as…

18 minutes ago

Ramayana US Premiere Date Locked: Massive IMAX Trouble

Bollywood's biggest film Ramayana could face a massive setback in the US market, with its…

34 minutes ago