ఇప్పటికైనా సూర్యకి లైన్ క్లియర్ అయ్యిందా ?

Vijay Swearing-In Effect on Suriya’s Veerabhadhrudu

తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

నిన్నటివరకు విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాడో లేదో అనే టెన్షన్ లో.. సూర్య తాజా చిత్రం “కురుప్పు” తెలుగులో “వీరభద్రుడు” రిలీజ్ అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ ఉండేది. అక్కడి పరిస్థితులను బట్టి సినిమా పోస్ట్ పోన్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు నిర్మాతలు.

ADVERTISEMENT

ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం విజయవంతంగా ముగియడంతో.. కరుప్పు వైపు చూపు మళ్లింది. ఇవాళ ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు.

అయితే.. ఈ విజయ్ మేనియాలో అసలు జనాలు థియేటర్ కి వచ్చి సూర్య సినిమా చూస్తారా? ఎందుకంటే కనీసం ఇంకోవారమైనా ఈ పొలిటికల్ హంగామా ఉంటుంది.

విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక.. త్రిష నటించగా విడుదలవుతున్న మొదటి సినిమా ఇది. ఇప్పుడు ఇది ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

ADVERTISEMENT
Latest Stories