
కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ శనివారం చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద ఓ సభలో పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడుతూ, “నాకు ఎదురవుతున్న సమస్యల గురించి మీరందరూ బాధ పడుతుంటే నేను చూడలేను. నాకు ఇంకా బాధ కలుగుతుంది.
నా వ్యక్తిగత సమస్యలను ఏవిధంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. కనుక నా సమస్యలపై మీరు పోరాడాల్సిన అవసరం లేదు. వాటి సంగతి నాకు వదిలేసి మీరందరూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయండి,” అని అన్నారు.
విజయ్ సినిమాలు వదిలి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు కనుక రాజకీయ ప్రత్యర్ధులు ఇబ్బంది పెడతూనే ఉంటారు. ఆయన నటించిన జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఓ చిన్న నిదర్శనం. దానిని అందరూ తప్పు పడుతున్నారు. ఆ విషయంలో సినీ పరిశ్రమతో పాటు ప్రజలు సానుభూతి విజయ్‌కి లభిస్తోంది.
కానీ భార్య పిల్లలను వదిలి మరో నటితో వైవాహేతికేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఎవరూ హర్షించలేరు. ముఖ్యంగా భార్య, పిల్లలు. అందుకే భార్య సంగీత విడాకులు కోరుతున్నారు. ఆమె ఈ కారణంతో విడాకులు కోరినందుకు విజయ్ సిగ్గుతో తలదించుకోవాలి. కానీ నటి త్రిషతో కలిసి ఓ నిర్మాత కొడుకు పెళ్ళికి వెళ్ళి వచ్చారు. జంటగా ఫోటోలు దిగారు.
కానీ తాను ‘భార్యా బాధితుడిని’ అన్నట్లు విజయ్ ఈవిధంగా మాట్లాడటం… అదీ మహిళా దినోత్సవ సభలో మాట్లాడటం సిగ్గు చేటు కాదా? తన సమస్యలపై కార్యకర్తలు పోరాడవద్దంటూ విజయ్ పరోక్షంగా కార్యకర్తలను తన భార్యపైకి ఉసిగొల్పుతున్నట్లే ఉంది తప్ప బాధ పడుతున్నట్లు లేదు.
ఇలాంటి పరిస్థితిలో ఉన్న మహిళలను అభిమానులు, పార్టీల సోషల్ మీడియా వారియర్స్ ఎంతగా ఏవిధంగా వేదిస్తారో రోజూ చూస్తూనే ఉన్నాము కదా? ఒకవేళ సంగీత ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నట్లయితే, అదే.. విజయ్, టీవీకే పార్టీల పాలిట శాపంగా మారవచ్చు. భార్యతో విడిపోతున్నందుకు తమిళ మహిళలు అభ్యంతరం చెప్పకపోవచ్చు కానీ భార్యని వేధింపులకు గురి చేస్తే సహించబోరు.
ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ డైవోర్స్ గొడవలు, త్రిషతో విజయ్ ఎఫైర్‌లను రాజకీయ అస్త్రాలుగా ప్రయోగించకుండా ఉండరు. ఇదే జరిగితే త్వరలో జరుగబోయే ఎన్నికలలో విజయ్‌తో సహా టీవీకే పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చు. కనుక ఎన్నికలకు ముందు ఈ విడాకుల వ్యవహారంతో విజయ్‌కి సానుభూతి లభించదు. ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…