
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తన సినిమాలలో విలన్ గ్యాంగులని ఒంటి చేత్తో చితక బాదేస్తారు. రాజకీయ నాయకులను, పోలీస్ అధికారులను గడగడలాడించేస్తారు. ఇలాంటి అసాధ్యమైన పనులు అవలీలగా చేసేస్తూ అభిమానుల చేత జేజేలు పలికించుకొని రాజకీయాలలో అడుగు పెట్టారు.
అక్కడా ప్రజల చేత జేజేలు పలికించుకొని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. జయజయధ్వానాలు మారుమ్రోగుతుండగా లోక్ భవన్‌లో అడుగుపెట్టిన విజయ్‌ని గవర్నర్ ఆర్లేకర్ వాస్తవ ప్రపంచంలోకి తీసుకువచ్చారు.
అందరికీ సినిమాలు చూపించిన తనకే గవర్నర్ సినిమా చూపించే సరికి విజయ్ షాక్ అయ్యారు. ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసేందుకు తెల్లటి పంచెలు ఇస్త్రీ చేయించుకొని సిద్దంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన, నిరాశ నిస్పృహలతో అల్లాడిపోతున్నారు.
గవర్నర్ ఆర్లేకర్ నిన్న రెండోసారి వెనక్కు తిప్పి పంపిన తర్వాత విజయ్, పార్టీ ఎమ్మెల్యేలు, న్యాయ నిపుణులతో సుదీర్గంగా చర్చించారు. ఆ సమావేశంలో అనేక ప్రతిపాదనలు పరిశీలించారు.
1. చిన్నా చితకా పార్టీల మద్దతు కూడగట్టుకొని 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మళ్ళీ గవర్నర్‌ని కలవడం.
2. ప్రభుత్వ ఏర్పాటుకి తమని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ని ఆదేశించమని కోరుతూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.
3. గవర్నర్ తీరుకి నిరసనగా విజయ్‌తో సహా 108 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం.
అన్నాడీఎంకే-బిజేపిల మద్దతు తీసుకోవడానికి విజయ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ‘అవినీతికి కేరాఫ్ అడ్రస్’ అని విజయ్ విమర్శించినందున ఇప్పుడు ఆ పార్టీని మద్దతు కోరలేరు.
కనుక ఆప్షన్: 1కి అందరూ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కానీ ఈలోగా ప్లాన్-బీగా న్యాయపోరాటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు.
ఆప్షన్: 3 అందరూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. కోట్లు ఖర్చు చేసి ఎన్నికలలో గెలిస్తే, రాజీనామాలు చేసి ఎన్నికలంటే మళ్ళీ అంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చేసినా ఈసారి గెలుస్తారనే గ్యారెంటీ ఉండదు. కనుక రాజీనామాలకు ఒత్తిడి చేస్తే కొంతమంది ఎమ్మెల్యే గోడ దూకి పారిపోవడం ఖాయం. అప్పుడు టీవీకే పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది.
ఒకవేళ అందరూ రాజీనామాలు చేసి ఎన్నికలలో పోటీ చేసినా ప్రజలు అందరినీ గెలిపిస్తే ఈసారి కూడా 108 సీట్లే వస్తాయి తప్ప అవి 118 లేదా 150 కావు. పైగా ఈసారి కొందరు ఎమ్మెల్యేలు ఓడిపోతే టీవీకే పార్టీ బలం 108 కంటే ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక టీవీకే పార్టీ అధినేత విజయ్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నట్లు భావించవచ్చు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…