విజయ్‌ గెలిచాడా… లేక చిక్కులో పడిపోయాడా?

తమిళనాడులో గాలి తిప్పేశాడనే ఇమేజ్ వచ్చేసింది. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి అసలు నిజం బయటపడింది. 108 సీట్లు పెద్ద విషయం అయినా, 118 మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోవడం అంటే పవర్ దూరంలోనే ఆగిపోయినట్టే.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. ఆ 10 సీట్లు ఎవరు ఇస్తారు? ప్రచారం మొత్తం భాజపా, డీఎంకేపై దాడులతో నింపేసిన విజయ్‌… ఇప్పుడు అదే పార్టీల దగ్గరకి వెళ్లాల్సి వస్తే, అది పూర్తి యూ టర్న్ కాదా?

ADVERTISEMENT

కాంగ్రెస్ ఎంట్రీ ఇక్కడ ట్విస్ట్ తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ ఫోన్ కాల్ సాధారణం కాదు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. డీఎంకే కూటమిలో ఉన్న పార్టీ ఇలా బయటికి చూసేలా మాట్లాడితే, అది స్టాలిన్‌కి క్లియర్ వార్నింగ్‌లా మారుతుంది.

చిన్న పార్టీల లెక్కలు చూస్తే గణితం సెట్ అవుతుందనిపిస్తుంది. కానీ వీసీకే, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు డీఎంకే కూటమిలో ఉండగానే విజయ్ వైపు వస్తాయా? లేక చివరి నిమిషంలో హ్యాండ్ బ్రేక్ వేస్తాయా?

ఎన్డీయే వైపు చూస్తే మరో గేమ్ కనిపిస్తోంది. మోదీ అభినందనలు సింపుల్ గెస్టర్ కాదు, స్పష్టమైన సిగ్నల్. భాజపా ఇప్పటికే టీవీకేని తమవైపు లాగాలని ప్రయత్నిస్తోంది అంటే, అక్కడ కూడా డీల్‌కు డోర్ ఓపెన్ ఉన్నట్టే.

ఇక్కడ విజయ్‌కి అసలు కష్టమొచ్చింది. ఎవరి సపోర్ట్ తీసుకున్నా ఒక కోణంలో నష్టం ఖాయం. భాజపాతో కలిస్తే ఇమేజ్ దెబ్బ. డీఎంకేతో ఒప్పందం చేస్తే మాట తప్పినట్టే. చిన్న పార్టీలతో వెళ్తే ప్రభుత్వం నిలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న.

ఇప్పటికీ టీవీకే నుంచి ఒక్క క్లియర్ లైన్ కూడా లేదు. ఇదే సైలెన్స్ ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తోంది. గెలిచిన నాయకుడిగా నిలుస్తాడా… లేక మొదటి పరీక్షలోనే తడబడిన కొత్త రాజకీయ నాయకుడిగా మిగిలిపోతాడా అనేది ఈ 10 సీట్లు చెప్పబోతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

11 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

16 minutes ago