
మరో నాలుగైదు నెలల్లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి కోలీవుడ్ నటుడు విజయ్ టీవీకే పార్టీతో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఏ పార్టీతో పొట్టు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. పొత్తు కోసం బిజేపి ఎంత ఒత్తిడి చేస్తున్నప్పటికీ లొంగేదేలే అని తేల్చి చెప్పేశారు. ఈసారి మేమే గెలిచి అధికారంలోకి వస్తున్నాం అంటూ విజయ్ అప్పుడే ‘ఈల’ వేస్తున్నారు.
కానీ ఇండియా టుడే-సీ ఓటర్ చేసిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మొత్తం 39కి 38 సీట్లు గెలుచుకుంటుందని తేల్చి చెప్పేశాయి.
అయితే విజయ్ ఎంట్రీతో కూటమి ఓటింగ్ శాతం 47 నుంచి 45కి తగ్గుతుందని చెప్పాయి. అన్నాడీఎంకే-బిజేపి కూటమికి ఒకే ఒక్క ఎంపీ సీటు వస్తుందని, ఓటింగ్ శాతం 41 నుంచి 33 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.
విజయ్ టీవికే పార్టీ ఈ రెండు కూటముల ఓట్లు చీల్చి సుమారు 15 శాతం ఓట్లు సాధించగలదు కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని సర్వే స్పష్టం చేసింది.
ఈ లెక్కన అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 45 శాతం, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకే-బిజేపి కూటమికి 33 శాతం, టివికే పార్టీకి 15 శాతం ఓటు బ్యాంక్ ఉందని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, టివికే పార్టీ శాసనసభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని అర్ధమవుతోంది.
కానీ టివికేతో పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతున్న బిజేపి కూటమితో చేతులు కలిపితే మొత్తం 33+15 శాతం కలిపి 48 శాతం అవుతుంది. తొలి ప్రయత్నంలోనే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో భాగస్వామి కావచ్చు.
కానీ విజయ్ వాపును చూసి బలుపు అనుకుంటూ ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతున్నారు. కనుక సర్వేలో చెప్పినట్లు ఓటమి తప్పకపోవచ్చు.
తమిళనాడు రాజకీయాలలో విజయ్ రాణించాలనుకుంటే, చిరంజీవిలా కాకుండా పవన్ కళ్యాణ్‌లా ఆలోచించడం చాలా మంచిది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…