Telugu

తమిళ అసెంబ్లీ: సినిమా స్టార్స్ మధ్య యుద్దమా.?

నిన్న విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకరిని ఊహించని స్థాయిలో అందళం ఎక్కిస్తే, మరొకరిని ఊహకు అందని స్థాయిలో పాతాళానికి నెట్టింది. పోటీ చేసిన తొలి ఎన్నికలతోనే 108 స్థానాలలో విజయం సాధించి విజయ్ టీవీకే తమిళనాడు రాజకీయాలలో మరోకొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

అలాగే గత కొన్ని దశాబ్దాలుగా ఓటమి అనేదే లేకుండా ఎమ్మెల్యే గా నెగ్గుతున్న స్టాలిన్ టీవీకే పార్టీ అభ్యర్థి V.S బాబు చేతిలో ఘోర ఓటమిని అందుకున్నాడు. ఈ రెండు అంశాలు కూడా తమిళ రాజకీయలలో సంచలనంగా మారాయి.

ADVERTISEMENT

అయితే డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమి పాలవ్వడంతో ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, తన తండ్రి స్టాలిన్ బాధ్యతలను భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. విజయ్ టీవీకే 108 సీట్లతో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగా. డీఎంకే సింగల్ గా 59 స్థానాలలో విజయం సాధించి రెండవ పెద్ద పార్టీగా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.

దీనితో అటు తమిళనాడు సీఎం గా దళపతి విజయ్ ఉండగా ఇటు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ కనిపించనున్నారు. సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరు కూడా సినీ రంగానికి సంబంధించిన వారే కావడంతో ఇక రాబోయే తమిళ అసెంబ్లీ సినిమాటిక్ ఫీల్ ను అందించనుందా అన్న చర్చ ఊపందుకుంది.

తమిళనాడు అసెంబ్లీ కి సినీ తరాల రాజకీయ యుద్ధం కొత్తేమి కాదు కాబట్టి ఆ వింటేజ్ రాజకీయాలు మరోసారి రాజకీయ తెరమీద ఆవిష్కృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజులలో విజయ్ – స్టాలిన్ ల రాజకీయ పోరు ఏ విధంగా ముందుకెళ్లనుందో.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Peddi, Paradise, Bhogi: Mass Formula Tiring Out Audiences

“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…

33 minutes ago

Jailer2 Trailer Review: Will the Hype Drop or Boost Now?

The most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar was released recently…

1 hour ago