మన గతం మర్చిపోయి మరొకరి మీద ఆరోపణలా… విజయసాయి రెడ్డి గారు?

ప్రస్తుతం అరెస్టు అయ్యి జైలులో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, ఆయన సతీమణి దేవికారాణి వందలాది కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం విశేషం.

ఆర్‌బీఐ, ఐటీ నిబంధనలు, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ విదేశీ బ్యాంకులకు పెద్దఎత్తున నల్లధనం తరలించారని తెలిపారు. వి.రవిప్రకాశ్‌ అలియాస్‌ రవిబాబు తన హోదాను ఉపయోగించుకుని బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలకు పాల్పడ్డారని, న్యూస్‌ చానళ్లు, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని పెద్దఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు.

ADVERTISEMENT

గతంలో రవిప్రకాష్ జగన్ కేసుల సందర్భంగా ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చెయ్యడంతో ఆ కసితో విజయసాయి రెడ్డి ఈ లేఖ రాసినట్టు అర్ధం అవుతుంది. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం విశేషం. అయితే దీనిపై సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.

ఆ లేఖలో విజయసాయి రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ కేసులన్నీ ఆయన స్వయంగా ఈదురుకుంటుండడం. మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసులలో ఆయన రెండో ముద్దాయి అయితే ముఖ్యమంత్రి జగన్ మొదటి ముద్దాయి. ఆయా కేసులలో ఆయన ప్రస్తుతం బెయిలు పై ఉన్నారు. అవన్నీ మర్చిపోయి ఆయన రవిప్రకాష్ మీద ఆరోపణలు చెయ్యడం ఏంటని వారి ఆరోపణ.

ADVERTISEMENT
Latest Stories