విజయశాంతి… రాజకీయాల మీదే ఫుల్ ఫోకస్

vijaya shanti full time politicsసీనియర్ నటి విజయశాంతి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో తెలుగు సినిమాకి తిరిగి వచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. అయితే ఆమె ఇప్పటివరకు తన తదుపరి చిత్రం సైన్ చెయ్యలేదు.

ADVERTISEMENT

ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బిజెపి పార్టీలో చేరడం ద్వారా కొత్త రాజకీయ మలుపు తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో, ఈ సీనియర్ నటి తాను మునుముందు సినిమాలు చేయనని ధృవీకరించారు. “కాంగ్రెస్ పార్టీలో ఏమీ చెయ్యనివ్వకపోవడం వల్ల నాకు ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో సరిలేరు నీకెవ్వరూ వచ్చింది. అదే సమయంలో గౌరవప్రదమైన పాత్ర. కాబట్టి నేను చేసాను. కాని బిజెపిలో చెయ్యాల్సింది ఎంతో ఉంది. కాబట్టి నాకు సినిమాలకు సమయం లేదు” అని విజయశాంతి అన్నారు.

విజయశాంతి పొరపాటు రాజకీయ నిర్ణయాల వల్ల ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఇప్పుడు, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేలా చూస్తున్న బిజెపిలో చేరడం ద్వారా ఆమె రాజకీయంగా ప్రాముఖ్యతను పొందాలనుకుంటున్నారు. చూడాలి ఆమెకు ఏం రాసిపెట్టి ఉందో?

ఏది ఏమైనా 13 ఏళ్ల తరవాత తన ముఖానికి మేకప్ వేసుకున్న విజయశాంతి మునుముందు ఇక ఆ అవకాశం లేదని చెప్పేసి ఆమె అభిమానులను నిరాశపరిచారు. త్వరలో రానున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక… మరికొన్ని మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనాలని ప్లాన్ చేస్తుంది. వాటిలో విజయశాంతిని కూడా వాడుకోవాలని బీజేపీ రాష్ట్ర పార్టీ ఆలోచన అట.

ADVERTISEMENT
Latest Stories