జగన్ ను మానిప్యులేట్ చేస్తున్న ఆ మానిప్యులేటర్ ఎవరు.?

వైసీపీ నుంచి అవమానభారం తో బయటకొచ్చి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి కానీ తనను ఎన్నడూ అవమానించలేదని, కానీ వైఎస్ జగన్ మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను ఘోరంగా అవమానించారంటూ వాపోయారు.

వైసీపీ లో తనకు 70 కి పైగా అవమానాలు జరిగాయని, అయినా కూడా జగన్ కోసం అన్ని భరించానని, చివరికి జగన్ కూడా చెప్పుడు మాటలు విని తనను అవమానించారని, తనను పార్టీ నుంచి బయటకు గెంటెందుకు పొమ్మనకుండా పొగపెట్టారని, అందుకే చివరికి వైసీపీ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని మరోమారు వైసీపీ లో తనకు జరిగిన అవమానాల చిట్టా పొద్దు వివరించారు విజయసాయి.

ADVERTISEMENT

అయితే వైసీపీ పార్టీలో జగన్ తరువాత స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి మీద జగన్ కు చెప్పుడు మాటలు చెప్పిన వారు ఎవరు.? వారి మాటలకు జగన్ అంతటి విలువ ఎందుకిస్తున్నారు.? తనకు, తన పార్టీకి, తన కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచి జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా కేసులు ఎదుర్కొని, ఆరోపణలు మోసిన సాయిరెడ్డి ని వైసీపీ నుంచి బయటకు పంపితే ప్రత్యామ్నాయంగా పార్టీలో లబ్ది పొందే వారు ఎవరు.?

సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావడానికి చెప్పుడు మాటలు కారణమైతే మరి షర్మిల వైసీపీ నీ వీడడానికి, జగన్ కు ప్రత్యర్థిగా మారడానికి కారణం ఏంటి.? చివరికి సొంత తల్లి విజయలక్ష్మి కి వ్యతిరేకంగా జగన్ కోర్టులో కేసులు వేసే స్థాయికి వెళ్ళడానికి కారణం ఎవరు.? తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలకు వ్యతిరేకంగా జగన్ వేస్తున్న అడుగులవెనుక ఎవరున్నారు.?

సొంత మేనకోడలు అంజలి రెడ్డి పెళ్ళి వేదిక కు కూడా అభ్యంతరాలు చెప్పే స్థాయికి వైఎస్ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కడం వెనుకున్న ఆ అదృశ్య శక్తి ఎవరు.? జగన్ ను తన మాటలతో అంతలా ప్రభావితం చేస్తున్న, చెయ్యగలుగుతున్న ఆ మానిప్యులేటర్ ఎవరు.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dilwali Diwali Review: Template Festive Fare, Just Bearable

BOTTOM LINE Template Festive Fare, Just Bearable PLATFORM Netflix RUNTIME 1Hour 1 Min What Is…

7 minutes ago

Film Event Gets Political Vibe, But Why?

South India is witnessing a wave of film stars entering politics and tasting tremendous success.…

21 minutes ago