
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో విజయసాయి రెడ్డి కూడా ఆయనపై ట్విట్టర్ బాణాలు సంధించారు.
“కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము – ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. విపక్ష నాయకులు తాము ఫలానా కులానికి చెందినవారమని…కాబట్టి ఆ కులం వారంతా గంపగుత్తగా తమకే ఓటు వేయాలని మైకులు పట్టుకొని మీద పడుతున్నారు. YSRCP మాత్రం కులం, మతం, వర్గం, పార్టీ, ప్రాంతం చూడదు…అందరినీ సమంగా ఆదరిస్తుంది,” అని ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలో నేతలు, సలహాదారులు, కీలక పదవులలో అధికారులు, చివరికి టీటీడీలో కూడా రెడ్డి సామాజిక వర్గంతోనే నింపేశారు. మిగిలిన పదవులే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాయి.
వైసీపీ అన్ని వర్గాలను కలుపుకుపోవాలని కాక ఓట్ల కోసమే కులరాజకీయాలు చేస్తోందని అందరికీ తెలుసు. వేలకోట్లు ఖర్చుచేసి నిర్మిస్తున్న అమరావతి మీద కుల ముద్ర వేసి పాడుబెట్టేసింది వైసీపీయే కదా?పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపుల ఓట్లను నొల్లుకుపోతారో అనే భయంతోనే ముద్రగడ పద్మనాభాన్ని ముందుకు తీసుకువస్తున్నది వైసీపీయే కదా?
నిజానికి టిడిపి మొదటి నుంచి అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యం, గౌరవం ఇస్తోంది. కనుకనే అన్ని కులమతాల నాయకులు, కార్యకర్తలు, దశాబ్ధాలుగా టిడిపినే అంటిపెట్టుకొని ఉంటున్నారు తప్ప అధికారం కోల్పోయిందని వైసీపీలో చేరిపోలేదు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట తన కులరాజకీయాలకు దూరంగా ఉండేవారు. ‘కులాలను విడదీయడం కాదు అన్ని కులాలాలను కలుపుకుపోవాలనేదే తన ఆశయం’ అని చెప్పేవారు. ఆయన పనిగట్టుకొని కాపులను దగ్గరయ్యేందుకు ప్రయత్నించకపోవడం వలననే గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని అందరికీ తెలుసు.
ఈ పదేళ్ళ రాజకీయ అనుభవంతో పవన్ కళ్యాణ్ కూడా మారకతప్పలేదు. అందుకే ఇప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆయనను ఈవిదంగా మార్చింది వైసీపీయే కదా? కానీ నేటికీ పవన్ కళ్యాణ్‌కి కులం, మతం పిచ్చిలేదనే చెప్పాలి. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ కలుపుకుపోవాలని ప్రయత్నిస్తుంటారు.
కానీ గురివింద గింజ తన నలుపెరుగదన్నట్లు ఓ కులం, ఓ మతం పునాదుల మీదే నిర్మించుకొన్న వైసీపీలో ఉంటూ ఎదుటపార్టీలకు నీతులు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా కాక్రోచ్లు చేస్తున్న రాజకీయానికి ఏపీలో ఎంట్రీ లభిస్తుందా.? సీజేపీ నేతలు…
Nuveksha gives the classic red saree a fresh, playful spin in this striking indoor photoshoot.…