స్థిరత్వం లేని మనస్తత్వం..!

సినీ రంగం నుండి రాజకీయ రంగంలో అడుగు పెట్టిన విజయ శాంతి సినీ రంగంలో చూసిన అంచులను రాజకీయ రంగంలో తాకలేకపోయారు. స్థితర్వం లేని మనస్తత్వం, నిలకడ లేని విధానంతో సొంత పార్టీని విలీనం చేసి, ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేక ఒక్క టీడీపీ తప్ప తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల కండువాలను తన భుజాల మీద మోశారు ఈ రాములమ్మ.

తానూ ఉన్న పార్టీ అధికారంలోకి రాకపోవడమో లేక అధికారం ఉన్న పార్టీలతో తానూ ఇమడలేక పోవడమో కానీ ఎన్నికల ముందు హడావుడి చేసి మీడియాలో కనిపించే విజయ శాంతి ఎన్నికల ఫలితాల తరువాత మాత్రం సైలెంట్ అయ్యిపోతుంటారు. తానూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూడా అదే ధోరణిలో ముందుకెళ్తారు. దీనికి కారణం కేవలం నాయకులను, క్యాడర్ ను సమన్వయము చేసుకోలేకపోవడమే.

ADVERTISEMENT

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాములమ్మ టి.టీడీపీ పార్టీని, బాబు ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించడానికి ముందుకొచ్చిన ఇరు ముఖ్యమంత్రుల భేటీ మీద ఈమె స్పందించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను ఆశించి బాబు హైద్రాబాద్ వచ్చారనుకుంటే ఆయన తెలుగు దేశం ప్రయోజనాలను ఆశించి వచ్చారనేది స్పష్టమయ్యిందన్నారు.

తిరిగి చంద్రబాబు తెలంగాణలో తన పార్టీని విస్తరించాలని చూస్తున్నారని, అది అసాధ్యమని, బీజేపీ తో కలిసి ఇక్కడ కూడా బాబు రాజకీయం చేయడానికి తెర వెనుక చక్రం తిప్పుతూన్నారంటూ బాబు పై తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చింది. రాజకీయాలలో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి వెనుకడుగు వేయడం అంటే రాజకీయ సన్యాసంతో సమానమే అవుతుంది.

బిఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్ ను గద్దె దింపి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటే కాంగ్రెస్ నాయకులే నమ్మలేదు. కానీ పట్టుదలతో ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రేవంత్ నిరూపించి చూపించారు. అలాగే గత ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాలలో ఒక్కదాన్నే దక్కించుకున్న జనసేన ఈ ఎన్నికలలో 100 % స్ట్రైక్ రేట్ తో దేశాన్నే తన వైపు చూసేలా చేసుకోగలిగింది.

అలాగే బాబు అరెస్టు సమయంలో టీడీపీ పనైపోయింది, తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా జెండా పీకేయడం ఖాయం అంటూ వైసీపీ నాయకులు టీడీపీ నేతల ఆత్మస్తైర్యాన్ని దెబ్బకొట్టిన పడి లేచిన కెరటం మాదిరి ఉవ్వెత్తున లేచి 135 స్థానాలలో విజయ కేతనం ఎగరేసింది. ఇవన్నీ తెలిసి కూడా వియజయశాంతి అవగాహనా రాహిత్యంతో టి. టీడీపీ మీద విమర్శలు చెయ్యడం ఆమె అవివేకమే అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is Rashmika Mandanna India’s No. 1 Actress?

Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…

25 minutes ago

Southern India’s Water War: CBN’s Biggest Challenge Ahead

Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…

55 minutes ago