
రాబోయే మూడేళ్ళలో రాజధాని అమరావతిలో చాలా నిర్మాణాలు పూర్తవుతాయి. వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక ప్రైవేట్ కంపెనీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, ఐటి కంపెనీలు వంటివి ఉంటాయి. కనుక వాటి నిర్మాణాలు పూర్తయ్యి కార్యకలాపాలు మొదలైతే విజయవాడ, గుంటూరులో జనాభా, వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతుంది.
కనుక ఆలోగానే విజయవాడ మెట్రోని కూడా సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం మెట్రో చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ జీపీ.రంగారావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు విజయవాడలో మెట్రో మార్గంలో పర్యటించి భూసేకరణ ప్రక్రియకి సన్నాహాలు ప్రారంభించారు.
రెండు దశలలో మెట్రో నిర్మించబోతున్నారు. మొదటి దశలో రెండు మెట్రో కారిడార్స్ నిర్మించబోతున్నారు.
కారిడార్ 1: విజయవాడ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు 26 కిమీ పొడవు.
కారిడార్ 2 : విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.4 కిమీ పొడవు.
ఈ రెండు కారిడర్లలో కలిపి మొత్తం 34 మెట్రో స్టేషన్లు నిర్మిస్తారు. రెండో దశలో మరో 27.25 కిమీ పొడిగిస్తారు. రెండు దశలలో కలిపి మొత్తం 66.15 కిమీ పొడవునా మెట్రో కారిడార్ నిర్మించబోతున్నారు.
ఈ మొదటి దశ పనుల కోసం సుమారు రూ.11, 009 కోట్లు అంచనా వేసి దానిలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,152 కోట్లు కేటాయించింది.
ఈ మెట్రో కారిడార్‌తో పాటు పైన ఫ్లై ఓవర్ కూడా నిర్మించబోతున్నారు. తద్వారా రెండుసార్లు భూసేకరణ, ఖర్చుల భారం తగ్గించుకోవడమే కాక, భవిష్యత్‌లో మళ్ళీ ప్రత్యేకంగా ఫ్లై ఓవర్లు నిర్మించుకోవలసిన అవసరం లేకుండా దీంతో బయటే పూర్తి చేస్తారు.
విశాఖపట్నంలో కూడా మెట్రో కోసం చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు నగరాలలో మెట్రో కోసం సుమారు రూ. 42,362 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి, నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితులలో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
Mohammed Shami is still hoping for another chance to play for Team India, and his…
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…