అణగారిన వర్గాల అభివృద్దా…అణిచివేతా?

నేడు జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా అణగారిన వర్గాల అభివృద్ధికి రాష్ట్రంలో కులగణన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ దాని పై నిర్ణయం జరిగిందంటూ మంత్రులు వివరించారు.కులం చూడం మతం చూడం అనే ఈ ప్రభుత్వానికి కులగణనతో పనేంటో..అయినా అధికార పదవులన్నీ ఒక సామజిక వర్గానికే కట్టబెట్టే జగన్ కులగణన చేసి ఏం సాధిస్తారో అంటున్నారు విపక్షాలు.

ఈ నేపథ్యంలో వైకాపా ‘X ‘ఎంపీ…అదేలేండి ఎక్కువగా అక్కడే స్పందిస్తుంటారు ఆయన. విజయసాయి రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల ఉన్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని,వారి అభ్యున్నతే జగన్ ధ్యేయం అంటూ చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి అంటే ఇవేనా ఎంపీ గారు అంటూ రాష్ట్రంలో దళితుల మీద జరిగిన దాడులను వాటికీ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ ఇదేనా అభ్యున్నతి అంటే అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

కరోనా సమయంలో తమకు మాస్కులు కావాలి అంటూ అడిగిన డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని మరోసారి బయటకు తీసుకువచ్చారు. అలాగే సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తిని వైసీపీ ఏమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంగతిని,ఆ నేతకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఒక్కసారి విజయసాయి రెడ్డి గుర్తుచేసుకోవాలంటూ జగన్ తో అనంతబాబు కలిసి పాల్గొన్న వీడియోలను ఆధారాలుగా చూపిస్తూ ఇదేనా అణగారిన వర్గాల కోసం జగన్ పడుతున్న ఆరాటం అంటూ నినదించారు.

గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకి కృషిచేసి వైకాపా అధికారంలోకి వచ్చాక వైసీపీ దాష్టికాలను ప్రశ్నించిన మహాసేన రాజేష్ పై ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దాడులును గుర్తుచేశారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనిలో కాండ్రు శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడిని కొందరు నిర్బంధించి చిత్ర హింసలు పెట్టిన వార్తలు ఈ ప్రభుత్వానికి కనపడవా? సమాజం తలదించుకునేలా ఆ యువకుడి పై వారు ప్రవర్తించిన తీరు అమానవీయం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటుచేసిన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయినా ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడిని అని వాపోవడం ..జగన్ జమానాలో దళితులపై అణిచివేత చర్యలకు పరాకాష్ట అంటూ లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితుల అభివృద్ధికై ఎంతగా కృషి చేస్తుందో చుడండి అంటూ లోకేష్ పెట్టిన ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

దళితుల అభివృద్దే ఈ ప్రభుత్వ లక్ష్యం అయితే వారి ఉన్నత చదువులకై గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అంబేడ్కర్ విదేశీ విద్యను పేరు మార్చి.,నిబంధనలు మారుస్తూ., వారికీ రావాల్సిన నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నారో ఈ జగన్ ప్రభుత్వం కానీ విజయ సాయి రెడ్డి కానీ సమాధానం చెప్పగలరా?

ఈ ప్రభుత్వం చేస్తుంది అణగారిన వారి అభివృద్ధికి చర్యలు కాదు వారి అణిచివేతకు కుట్రలు అంటూ ప్రతిపక్షాలు, దళిత సంఘాలు న్యాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాయి. అభివృద్ధికాదు మహాప్రభో న్యాయం చేయండి చాలు అంటున్నారు బాధిత
కుటుంబాలు. విజయసాయి రెడ్డి గారు ఇదికూడా ప్రతిపక్షాల కుట్రే అంటూ తోసిపారేస్తారో లేక బాధితులకు అండగా నిలుస్తారో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

1 hour ago

Actress Divya Bharathi Dating IPL Star? Real or Rumors?

Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…

2 hours ago