ఆయన పురందేశ్వరి వెంట పడుతున్నారు ఎందుకో?

వైసీపిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రం కోసం ఏమి చేస్తున్నారో తెలీదు కానీ ఒక్కొక్కరూ ఒక్కో సబ్జెక్ట్ మీద ప్రత్యేక శ్రద్ద, పాండిత్యం ప్రదర్శిస్తుంటారు.

ADVERTISEMENT

వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలతో ఫోటోలు దిగుతూ, మీడియాలో, సోషల్ మీడియాలో అవి వచ్చేలా చేసుకొంటారు. తద్వారా తనకు చాలా ఉన్నతస్థాయిలో పరిచయాలు, పలుకుబడి ఉన్నాయనే విషయం అందరికీ తెలియజేస్తుంటారు. బహుశః అందుకే అక్రమాస్తుల కేసులు విచారణ జరుపుతున్న సీబీఐ కూడా అడుగు ముందుకు వేయలేకపోతోందని భావించవచ్చు.

అలాగే కేంద్ర ప్రభుత్వం వలన ఏపీలో తమ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తోడ్పడుతుంటారని అప్పులు, అరాచకాలు, టిడిపి నేతలపై కేసులను చూస్తే అర్దమవుతుంది.

ఢిల్లీలో కూర్చొని ఈవిదంగా పైరవీలు చేసే విజయసాయి రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్ చేసుకొని విమర్శిస్తుంటారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి విజయసాయి రెడ్డి ఆమెను విమర్శించని రోజు లేదు.

ఆమె చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలుకుతున్నారని, ఆయన కోసమే పనిచేస్తున్నారని, అందుకోసం ఏపీ బీజేపీని బలి చేసేందుకు వెనకాడటం లేదని విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆమె వైసీపి ప్రభుత్వ మద్యం వ్యాపారాలు, ఆ పేరుతో కుంభకోణాలకు పాల్పడుతోందని సాక్ష్యాధారాలతో సహా మాట్లాడుతుండటంతో, విజయసాయి రెడ్డి కూడా ఎదురుదాడి ప్రారంభించారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకి కూడా మద్యం కుంభకోణంలో భారీగా ముడుపులు తీసుకొన్నారని ఆరోపించారు. ఆమెపై ఇంకా అనేక ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేస్తూ వివిద కేసుల విచారణ ముందుకు సాగనీయకుండా కట్టడి చేస్తున్న విజయసాయి రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరిపై ఇటువంటి ఆరోపణలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

ఆమె ఏపీ బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని ఆయన ఎందుకు బాధపడుతున్నారో అర్దం కాదు. ఒకవేళ ఆమె ఏపీ బీజేపీని పణంగా పెట్టి టిడిపిని చంద్రబాబు నాయుడుని కాపాడుతున్నారని మోడీ, అమిత్ షాలు భావిస్తే ఆమెను ఆ పదవిలో కొనసాగనిచ్చేవారా?అంటే కాదనే అర్దమవుతుంది. పురందేశ్వరిని విమర్శిస్తూ ఏపీ బీజేపీలో చిచ్చు రాజేయాలని విజయసాయి రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు కదా?

ఒకవేళ పురందేశ్వరికి చంద్రబాబు నాయుడుపై అంత ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే ఇంతకాలం ఆయనను జైల్లో ఉండనిచ్చేవారా?తన పలుకుబడిని ఉపయోగించి విడిపించుకొనేవారు కదా?టిడిపిని కాపాడాలనుకొంటే ఆమె కూడా పార్టీలో చేరి ‘జగనన్న బాణం’లా చేరిపోయి చంద్రబాబు నాయుడు కోసం ధర్నాలు, పాదయాత్రలు చేసేవారు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…

5 hours ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

7 hours ago