
వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి నీతులు వల్లిస్తుంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసి వచ్చిందన్నట్లు అనే ఉర్దూ సామెత గుర్తొస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్‌లో తన పాండిత్యం ప్రదర్శిస్తున్న విజయ సాయిరెడ్డి, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో రాజకీయ సమీకరణాలపై తన అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
“తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సిపిఎం రాఘవులు గారు అన్నారంటే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు,” అని రెండు ట్వీట్లు వేశారు.
గత ఎన్నికలలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తులు పెట్టుకొని పోటీ చేసింది. కానీ అది ఫలించలేదు. అది వేరే విషయం. ఈసారి తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌కు మద్దతుగానే తప్పుకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవి నిజం కావచ్చు కాకపోవచ్చు.
కానీ ఓ రాజకీయ పార్టీగా తన అవసరాలు, రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకొనే హక్కు టిడిపికి ఉంది. దాని నిర్ణయాన్ని తప్పు పట్టడానికి విజయ సాయిరెడ్డి టిడిపిలో లేరు కదా?అయినా వైసీపికి నచ్చిన్నట్లే అన్ని పార్టీలు నడుచుకోవాలంటే వేరే పార్టీలు పెట్టుకోవలసిన అవసరమే లేదు కదా?
ఒకవేళ టిడిపి లేదా జనసేన చెప్పిన్నట్లు నడుచుకొమంటే వైసీపి నడుచుకొంటుందా?మూడు రాజధానుల ఆలోచన సరికాదని, దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ మొత్తుకొంటున్నా వైసీపి విందా?లేదు కదా?
విధానపరమైన అంశాలపైనే అది ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను గౌరవించనప్పుడు, తాము చెప్పిన్నట్లు ప్రతిపక్షాలు నడుచుకోవాలని, లేకుంటే అపవిత్రమని విజయ సాయిరెడ్డి తీర్మానించేస్తుందటమే విచిత్రం. వైసీపి మాత్రం టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకూడదంటారు. ఏపీ బీజేపీకి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షురాలుగా తగరంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టిడిపి సహకరించడం అపవిత్రం అంటారు. కామ్రేడ్స్ ఇంగ్లీష్ మీడియం సరికాదంటే వారికీ కులం ఆపాదించేసి, పెత్తందారులనే ముద్రవేసేస్తారు.
వీటితో వైసీపి అభద్రతాభావాన్ని బయటపెట్టుకొంటున్నట్లే ఉంది. అభద్రతాభావమే లేకపోతే “మేము ఎలాగూ 175 సీట్లు గెలుస్తాము కనుక ఏ పార్టీ ఎలాపోతే మాకెందుకు?” అన్నట్లు వ్యవహరించి ఉండేవారు కదా?
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is gearing up for a…
Nana Patekar passed away in Goa on October 8 at the age of 75 due…