‘మనం’ దర్శకుడు ‘ఇష్క్’ తెలిసిపోయింది!

vikram kumar, 24 movie director, sri nidhi, vikram marriage with srinidhi, manam director ‘ఇష్క్’ సినిమాతో టాలీవుడ్ లో బంపర్ హిట్ అందుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ కెరీర్ ‘మనం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల విడుదలైన “24” సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయినా, ప్రయోగాత్మక సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది. తనదైన శైలిలో త్వరలో మరో వినూత్నమైన సినిమాకు రూపకల్పన చేసుకుంటున్న విక్రమ్ ‘దిల్ కా దడ్కన్’ సెట్ అయిపోయిందని సమాచారం.

సినీ పరిశ్రమలోనే టెక్నికల్ విభాగంలో భాగమైన సౌండ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శ్రీనిధితో విక్రమ్ కే కుమార్ వివాహం నిర్ణయమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్ధ వేడుకలు చాలా నిరాడంబరంగా జరిగాయని, సెప్టెంబర్ లో మాంగల్య ముహూర్తం ఉంటుందని సమాచారం. శ్రీనిధి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వద్ద సౌండ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోంది. ‘24’ సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం… ప్రేమగా మారి చివరికి పెళ్లి పీటల వరకు తీసుకెళ్ళింది.

ADVERTISEMENT

అయితే ఈ లోపునే అల్లు అర్జున్ తో సినిమాను ప్రారంభిస్తారో లేక వివాహం పూర్తయిన తర్వాత ఫ్రెష్ గా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తారో అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ‘స్టెమ్ సెల్స్’ ఆధారంగా రూపొందించబోయే ఈ సినిమా కధ ఇప్పటివరకు ఇండియాలోనే ఎవరూ టచ్ చేయనిదిగా ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories