రోహిత్ – కోహ్లీ…ఒకే మరి ధోని.?

ఐపీఎల్ మొదలై కేవలం రెండు రోజులే అయ్యింది. కానీ, రోకో అభిమానుల కోరిక ఈ మొదటి రెండు రోజుల్లోనే నెరవేరింది. ఐపీఎల్ అంటేనే భారత్ లో ఒక క్రికెట్ పండుగ. అందరి అభిమానుల ఆరాధ్య ఆటగాళ్లు ఒకే లీగ్ లో పాల్గొని తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తే, అభిమానులు సైతం వారి ఫెవరెట్ జట్లకు తమ మద్దతు చూపుతుంటారు.

గత కొన్నేళ్లుగా.. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలకు ఐపీఎల్ లో పలుకుబడి తారా స్థాయికి అంటుకుంది. ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా కాలమవ్వగా, విరాట్ మరియు రోహిత్ ఇంకా ఆడుతుండటం వీరి పాపులారిటీ మరింత పెరుగుతుంది.

ADVERTISEMENT

ఇక, ఐపీఎల్ సీజన్ 19 లో విరాట్ ఉన్న ఆర్.సి.బీ జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది అని తెలిసినప్పటినుండి అభిమానుల జోష్ కు అవధులు లేకుండా పోయింది. చిన్నస్వామి లో మ్యాచ్ జరగనుండటంతో ఎన్నో నెలల తరువాత తమ కింగ్ కోహ్లీ ను చూసేందుకు అభిమానులు హోరెత్తారు.

గత సంవత్సరం జరిగిన సౌత్ ఆఫ్రికా వన్-డే సిరీస్ నుండి విరాట్ మళ్ళీ తన ప్రైమ్ ఫామ్ ను అందుకున్నాడటంలో సందేహమే లేదు. వన్-డేల్లో సెంచరీలతో చెలరేగుతూ ఈ ఐపీఎల్ లో అడుగు పెట్టిన కింగ్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ తొలి మ్యాచ్లోనే 69 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు.

తొలి మ్యాచ్లో విరాట్ ఇన్నింగ్స్ తో తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసిన కింగ్ కోహ్లీ తో హిట్-మ్యాన్ రోహిత్ శర్మ రెండో మ్యాచ్లో చెలరేగి బ్యాటింగ్ చేసాడు. 38 బంతుల్లో ఏకంగా 78 పరుగులు చేసి మ్యాచ్ ను వన్-సైడ్ చేసేసాడు హిట్-మ్యాన్. కళ్ళు చెదిరే పుల్ షాట్స్ తో అభిమానులకు కనువిందు చేసాడు.

221 పరుగుల ఛేదనలో తొలి 6 ఓవర్లకే తన 50 ను పూర్తి చేసాడు రోహిత్ శర్మ. 50 అయ్యేముందు ఎలా ఆడాడో, 50 పూర్తిచేసిన తరువాత కూడా అలానే ఆడుతూ జట్టుకు రన్-రేట్ లోటు రానివ్వకుండా చూసుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగాడు రోహిత్ శర్మ.

ఇలా, ఐపీఎల్ 2026 లో తమ తొలి మ్యాచ్లతోనే ఈ సారి ఐపీఎల్ లో తమ పర్ఫామెన్స్ బద్దలైపోద్ది అనే స్టేట్మెంట్ ఇవ్వకనే ఇచ్చారు ఈ ఇద్దరు సీనియర్లు. టి-20 క్రికెట్ కు దూరమయినా, ఇంటెంట్ లో ఏ మాత్రం తేడా ఉండదని నిరూపించారు. మరోపక్క ధోని ఇంజురీ తో జట్టుకు దూరమవ్వడంతో ధోని మైదానంలోకి ఎప్పుడు తిరిగి వస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి మాహి ఎప్పడు కం-బ్యాక్ ఇస్తాడో అని..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Campus Betrayal: Why Corporate Giants Deserve the Blacklist

The sudden decision by US tech giant Oracle to revoke campus placement offers and pre-placement…

8 minutes ago

విడాకుల విషయంలో బరస్ట్ అయిన హీరో

జయం రవి విడాకుల వార్త యావత్ సౌత్ స్టేట్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాయి. ముందుగా జయం రవి తన భార్య…

12 minutes ago