
క్రికెట్, ఎప్పుడో 17వ శతాబ్దంలో ఎక్కడో ఇంగ్లాండ్ దేశ వీధుల్లో ప్రాచుర్యం పొంది 1877 లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ తో వెలుగులోకి వచ్చిన క్రికెట్ కు సూర్యుడిలా ఉద్భవించారు ‘సచిన్ రమేష్ టెండుల్కర్’! నాడు ముంబై వీధుల్లో క్రికెట్ ఆడిన ఈ బాలుడు నేడు ఇండియాలో క్రికెట్ అనే మతాన్ని సృష్టించి ఆ మతానికి ఒక్కడే దేవుడనేలా ఆరాధింపబడుతున్నాడు.
మన దేశంలో ఎన్ని ఆటలు వచ్చినా, క్రికెట్ కు ఉన్న పిలుపు మరియు ఆ రాజసం మరొక ఆటకు రాదు. ప్రస్తుతం మన దేశంలో క్రికెట్ కు ఉన్న బ్రాండింగ్ మరొక రంగానికి లేదు. నేషనల్ జట్టులో చోటు సంపాందించటమే గొప్పగా ఉన్న నేటి రోజుల్లో ఒక ఆటగాడు 24 ఏళ్ళ పాటు ఒక ఆటకై తన జీవితం పెట్టేసాడంటే అది లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్.
కానీ అప్పట్లో చూసినట్లయితే పర్ఫామెన్స్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి జట్టులో చోటు దొరికితే కొంత కాలం వారికి ఆ చోటు కచ్చితంగా ఉండేది. కానీ గత 10-15 ఏళ్లగా చూస్కుంటే జట్టులో ప్లేయర్ చోటు ఖచ్చితమని చెప్పలేము. పెర్ఫామెన్స్ డ్రాప్ అయితే మొహమాటమేమి లేకుండా ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా జట్టునుండి బహిష్కరింపబడుతున్నారు.
అలాంటి పరిస్థితులను ఎదుర్కుని నిలబడ్డాడు కింగ్ కోహ్లీ. 2015-19 కాలంలో విరాట్ కోహ్లీ అనే పేరు వినబడితేనే చాలు క్రికెట్ లవర్స్ కి ఎనర్జీ టన్నులెక్కన వస్తుంది. విరాట్ క్రీజులో ఉంటే అపోజిషన్ కు మ్యాచ్ పై పట్టులేనట్టే.
ఒకపక్క ఆటతోను, మరోపక్క మాటతోను అగ్రెసివ్ ప్లేయర్ అనిపించుకున్న కోహ్లీ తన బ్యాట్ తో క్రికెట్ చరిత్రలో ఉన్న గత రికార్డు లను బద్డలుకొడుతూ, తన పేరిట కొత్త రికార్డులను నమోదుచేసుకుంటూ ఒక రన్ మిషన్ గా పేరు సంపాదించుకున్నారు.
అయితే 2019 కే 70 సెంచరీలు కొట్టేసి, సచిన్ పేరిట ఉన్న ‘100 సెంచరీలు’ రికార్డును విరాట్ త్వరలోనే కొల్లగొట్టేస్తాడనుకున్నారు అంతా. కరోనా తరువాత ఫామ్ కోల్పోయి రెండేళ్లు సతమత స్థితిలో ఉన్నా, మరల ఫామ్ అందుకుని జట్టుకు టి-20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
100 సెంచరీలు కేక్ వాక్ అనుకున్న రోజుల నుండి నేడు లెక్కలేసుకొని ఆదుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఇది విరాట్ తప్పిదం అని చెప్పలేము, అతను అందుకోవాలనుకున్న స్థాయి అంత గొప్పదని చెప్పాలి. క్రికెట్ లో సెంచరీ కొడితే చాలు అనుకునేవారు ఎందరో ఉంటారు, మరి అలాంటిది 100 సెంచరీలు కొట్టాలనే కల ఎంత గొప్పదో.
మూడు ఫార్మాట్లలో అందుబాటులో ఉంటే విరాట్ ఇప్పటికి కూడా ఆ రికార్డును అందుకుంటాడనే ధీమా ఉండేది కానీ, రెండు ఫార్మాట్లకు స్వస్తి పలికి కేవలం ఒక్క ఫార్మటు ఆడటం వల్ల ఈ లెక్కల అవసరం తప్పనిసరయ్యింది. ఇప్పటికి కోహ్లీ ఖాతాలో 84 సెంచరీలు ఉండగా, నిన్న న్యూజిల్యాండ్ పై 93 పరుగుల వద్ద సెంచరీకు కేవలం 7 పరుగుల దూరంలో తన వికెట్ ను చేజార్చుకున్నాడు.
మరి ప్రస్తుత కోహ్లీ ఫామ్ చూస్తుంటే 2027 వరల్డ్ కప్ కు కోహ్లీ పక్కా లా కనిపిస్తున్నాడు. కోహ్లీ అభిమానులు కూడా తన కెరీర్ ముగించే సమయానికి ఈ 100 సెంచరీల రికార్డును దాటాలని కోరుకుంటున్నారు.
అయితే ఆ సచిన్ 100 సెంచరీల రికార్డు వైపు చూసేందుకు దరిదాపులలో కూడా ప్రస్తుతం కోహ్లీ కాకుండా జట్టులో మరొకరు లేరు.కాబట్టి ఆ ఒక్క రికార్డు కోసం ఆ ఒక్కడే అన్నట్టుగా అందరి చూపు కోహ్లీ వైపే…మరి ఆ దిశగా కోహ్లీ ముందుకు సాగాలని ఆశిద్దాం..!
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…