‘రాయుడు’ టీజర్ టాక్ – టార్గెట్ ఎవరో తెలిసింది!

vishal rayudu teaser talk, telugu, d imman, sri divyaవిజయం కోసం నిర్విరామంగా ప్రయత్నాలు సాగిస్తున్న హీరో విశాల్ తాజాగా “రాయుడు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసింది.

తమిళ సినిమా ఊర మాస్ కళలు కనపడుతున్న ఈ టీజర్లో కొట్టడం గురించి తప్ప ‘కొత్తదనం’ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి మాస్ సినిమాలకు మాంచి ట్విస్ట్ లు, ఊపు తెప్పించే హీరోయిజం, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటే తప్ప ప్రేక్షకులు ఆదరించడం లేదు. మరి ‘రాయుడు’ ద్వారా విజయాన్ని అందుకోవాలని చూస్తున్న విశాల్ ఆశలు నేరవేరతాయో లేదో చూడాలి.

ADVERTISEMENT

అయితే విశాల్ టార్గెట్ మాత్రం ఈ టీజర్ తర్వాత అందరికీ అవగతమైంది. కేవలం మాస్ వర్గాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ‘రాయుడు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా అర్ధమవుతోంది. విశాల్ కు ఉన్న బలమైన మార్కెట్ కూడా మాస్ వర్గమే కావడంతో ఈ సారైనా ఆశించిన ఫలితాన్ని అందుకుంటాడని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories