
తొలి రోజే పైరసీ లింక్ లు అందుబాటులోకి వస్తే ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం చాలా పడుతుందనే చెప్పవచ్చు. అందులోనూ వినాయకచవితి పర్వదినం వీకెండ్ ఉండడంతో, భారీ ఓపెనింగ్స్ పై చిత్ర యూనిట్ ఆశగా ఉంది. అయితే ఈ ఆశలను అడియాశలు చేసే విధంగా మొదటి రోజే ఆన్ లైన్ లో పైరసీ లింక్ లు లభ్యం కావడం ఆందోళనకు గురి చేసే అంశం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే తొలి రోజు పైరసీ బారిన పడేవి. కానీ ప్రస్తుతం అవి విడుదలకు ముందు గానీ, ఫస్ట్ షోకు గానీ షిఫ్ట్ అయ్యాయి.
అలాగే ఒకప్పుడు దక్షిణాది సినిమాల పైరసీ రావాలంటే కనీసం మూడు, నాలుగు రోజులు లేక ఓ వారమైనా సమయం పట్టేది. అయితే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం రీత్యా అది కాస్త ఫస్ట్ డేకు షిఫ్ట్ అయినట్లుగా కనపడుతోంది. ఒక్క “వివేగం” విషయంలోనే కాదు, ఇటీవల విడుదల అవుతోన్న తెలుగు సినిమాల పరిస్థితి ఇదే. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మార్కెట్ లో క్రేజ్ ఉన్న సినిమాలు తొలి రోజునే పైరసీకి గురవుతున్నాయన్నది కాదనలేని సత్యం. ట్రేడ్ వర్గాలు ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఈ పైరసీని మాత్రం నియత్రించలేకపోతున్నారు.
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…