Telugu

విజయనగరం వైసీపీలో మరో రెండు వికెట్లు.. ఇంకెన్ని పడతాయో?

విజయనగరం జిల్లా వైసీపీలో నేడు మరో రెండు వికెట్లు పడ్డాయి. ఇటీవల పార్టీ, పదవులు వీడి టీడీపిలో చేరిపోయిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను ముఖ్య అనుచరులైన చీపురుపల్లి జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, జిల్లా వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు దంపతులు తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశారు. త్వరలో వారిరువురూ టీడీపిలో చేరే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జిల్లాలో బొత్స తర్వాత నం:2 స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్న చిన్న శ్రీను వెళ్ళిపోవడమే బొత్స సత్యనారాయణకు, వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటే ఇప్పుడు వరుసగా వికెట్లు పడుతున్నాయి.

ADVERTISEMENT

నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న చిన్న శ్రీను బావ అప్పలనాయుడిని తొలగింఛి ఆయన స్థానంలో సన్యాసి నాయుడును జగన్‌ నియమించడంతో, అయన కూడా పార్టీ వీడే అవకాశం ఉంది.

జిల్లాలో వైసీపీని జగన్‌ పునర్నిర్మించుకొని బలోపేతం చేసుకుంటుండగా, మరోపక్క ఈవిధంగా ఒక్కో నేత పార్టీని వీడుతున్నారు. కానీ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని చిన్న శ్రీను టీడీపిలో చేరిన రోజే చెప్పారు.

కనుక జిల్లాలో ఇంకా ఎన్ని వికెట్లు పడతాయో తెలీదు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీపై దీని ప్రభావం తప్పక పడుతుంది. కనుక బొత్స సత్యనారాయణ ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాలి.

ఒకవేళ అయన ఈ ఎన్నికలలో పైచేయి సాధిస్తే ఇక తిరుగు ఉండదు. కానీ చిన్న శ్రీను పైచేయి సాధిస్తే విజయనగరం జిల్లా రాజకీయాలలో బొత్స శకం ముగిసి. చిన్న శ్రీను శకం మొదలైనట్లే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్యారడైజ్ చూసేందుకు నానిని అనుమతించడం అవసరమా?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక తెలంగాణ…

23 minutes ago

Amaravati and Policing Get Major AP Cabinet Push

The Andhra Pradesh Cabinet, led by Chief Minister Chandrababu Naidu, has approved four new police…

56 minutes ago