
Fresh Resignations Hit Vizianagaram YSRCP
ఓసారి మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పుడు కామెంట్రీ బాక్సులో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ “సైకిల్ స్టాండ్‌లో ఒక సైకిల్ పడిపోతే వరుసగా అన్నీ టపటపా పడిపోయినట్లు మనోళ్ళు పడిపోతున్నారు..’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు విజయనగరం జిల్లా వైసీపీలో కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో విజయనగరం జిల్లా వైసీపీకి కంచుకోటలా కనిపించేది. కానీ చిన్న శ్రీను వెళ్ళిపోగానే పేక మేడలా టపటపా కూలిపోతోంది. ఇన్నేళ్ళుగా నిర్మించుకున్న కంచుకోట ఇంత బలహీనంగా ఉందా?అనిపించకమానదు.
ఓ పక్క వైసీపీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు, వారి అనుచరులు వరుసపెట్టి రాజీనామాలు చేసేస్తుంటే, మిగిలినవారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేస్తున్నారు. కనుక స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి జిల్లాలో పోటీ చేసేందుకు అభ్యర్ధుల కోసం వెతుక్కోవాలేమో?
తాజాగా మాజీ ఎమ్మెల్యే బొడ్డుపల్లి అప్పలనాయుడుకు సంఘీభావం తెలుపుతూ వైసీపీలో ఉన్న చీపురుపల్లి మండలం, దేవరకుదిరాoలో 50 కుటుంబాలు. గరివిడి మండలం కొమురం పాలవలస, కోనూరులో మరో 100 కుటుంబాలు రాజీనామాలు చేశాయి.
అయితే బయటకు వెళ్తున్న ప్రతీ ఒక్కరూ ఇక్కడితో ఈ కథ అయిపోలేదని ఇంకా చాలా ఉందని చెపుతుండటం, బహుశః ఇక్కడ బొత్స సత్యనారాయణ కుటుంబానికి, అక్కడ తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండవచ్చు. కనుక రేపు పక్క జిల్లాలో కూడా ఇలాగే జరిగితే?
Salman Khan's latest Weekend Ka Vaar has triggered criticism from a section of Bigg Boss…
రెండున్నరేళ్ళ క్రితం.. అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా?ఇంతగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని…