Telugu

ఇలా వదిలేస్తే వీళ్ళని ఎవరూ ఆపలేరు!

రెండున్నరేళ్ళ క్రితం.. అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా?ఇంతగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడుకే అప్పగించినా ఆయన గాడిన పెట్టగలరా? అనే ఆవేదన ఆంధ్రులలో కనిపించేది.

కానీ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కేవలం రెండున్నరేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్‌ రేసు గుర్రంలా పరుగులు పెడుతోంది. ఆ వేగానికి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని కూటమి ప్రభుత్వం ఓ పేరు పెట్టుకుంది.

ADVERTISEMENT

ఎప్పుడు ఏ ప్రభుత్వం సదస్సులకు ఆహ్వానించినా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు తప్పక వస్తారు.

కానీ మొహమాటానికో మొక్కుబడిగానో వచ్చినవారు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారే తప్ప లేచి నిలబడి ముఖ్యమంత్రి పట్ల గౌరవం ప్రదర్శించరు కదా?

శనివారం విజయవాడలో జరిగిన ‘పాన్ ఐఐటి సదస్సు’లో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన మేధావులు సిఎం చంద్రబాబు నాయుడు ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు, అందరూ లేచి నిలబడి ఆయన పట్ల గౌరవం కనపరిచారు.

ఆయన కూడా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇన్ని గంటల (ఆరు గంటలు) సేపు మీ వంటి మేధావుల మద్య గడపడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నా,” అని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ చేసిన ప్రసంగం వారిని చాలా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగంలో పూర్తి ఆత్మవిశ్వాసం, భవిష్యత్‌ పట్ల నమ్మకం, విషయ పరిజ్ఞానం, అన్నిటికీ మించి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అణువణువునా కనిపించాయి.

మచ్చుకు కొన్ని…

· రాజకీయ మార్పులను, కాలపరీక్షను తట్టుకొని స్థిరంగా నిలబడే విధానాలు రూపొందిస్తున్నాం. (అంటే భవిష్యత్‌లో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి విధానాలు మార్చలేని విధంగా నిలకడగా ఉండిపోతాయన్నమాట!)

· భారత్‌ అభివృద్ధికి 2047 వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేస్తే 10 ఏళ్ళు చాలు. ఇప్పటికే మొదటి 5 ఏళ్ళలో రెండున్నరేళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం. మిగిలిన రెండేళ్ళను కూడా సద్వినియోగం చేసుకొని దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిలబెడతాం.

· ఎంవోయులపై సంతకాలు పెట్టి మరిచిపోయే రోజుల నుంచి ప్రతీ శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం నేనే స్వయంగా పెద్ద ప్రాజెక్టుల పురోగతి గురించి ఆయా పారిశ్రామికవేత్తలకు మెసేజ్‌లు పంపిస్తున్నాను.

· ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ఐటి కంపెనీల స్థాపనతో మా లక్ష్యం పూర్తవుతుందని మేము అనుకోవడం లేదు. ఏపీని ‘ఐలాండ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ (మేధావులకు నిలయం)గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. అప్పుడు యావత్ దేశానికి ఆంధ్రప్రదేశ్‌ అవసరమైన మేధో సంపత్తిని అందజేస్తుంది.

· అమరావతి నిర్మాణ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ప్రతీ వంద రోజులకు ఓ అతి పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది.

· నేడు అందరూ మాట్లాడుకుంటున్న ‘స్కై రూట్’ (దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో పరిశోధన కేంద్రం) సంస్థకు ఏడాది క్రితమే ఏపీలో 300 ఎకరాలు కేటాయించాము.

· వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్న గూగుల్ డేటా సెంటర్‌ను కేవలం 13నెలల్లో, ఆర్స్‌లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ని 17 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు రప్పించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చేశాం.

· చంద్రబాబు నాయుడు 4.0 ఆపరేటింగ్ సిస్టం అయితే, మా యువడైనమిక్ మంత్రులందరూ దానికి ‘హార్డ్ వేర్‌’వంటివాళ్ళం.

· ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేసి, పాలన, అభివృద్ధి, నియామకాలలో చాలా వేగం పెంచాం. ఈవిధంగానే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు చాలా తక్కువ సమయంలోనే భర్తీ చేశాం.

ఒకప్పుడు నలుగురిలోకి వచ్చి మాట్లాడేందుకు తడబడే నారా లోకేష్‌, ఇప్పుడు వివిధ రంగాలకు చెందిన ఇన్ని వందల మంది మేధావుల ముందు నిలబడి ఇంత సాధికారికంగా మాట్లాడుతున్నారు. అలాగే ప్రతీ విషయాన్ని చక్కగా వివరిస్తూ తన ‘కమ్యూనికేషన్ స్కిల్స్’తో అందరినీ మెప్పిస్తున్నారు.

కానీ నారా లోకేష్‌ని ఒకప్పుడు చాలా అవహేళన చేసిన వైసీపీ అధినేత, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత మంది మేధావుల ముందు నిలబడి ఇంత అనర్గళంగా మాట్లాడగలరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

గులాబ్ జామ్‌లా స్థానిక ఎన్నికలు.. ఊరిస్తున్నాయి కానీ…

గులాబ్ జామ్ చూస్తే నోరూరుతుంది. కానీ నోట్లో వేసుకోవాలంటే షుగర్ పెరిగిపోతుందని భయం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా…

17 minutes ago

3L Houses and 3D Homes: CBN’s Big Housing Push

Chief Minister Chandrababu Naidu and Union Minister Shivraj Singh Chouhan launched construction works for 3…

1 hour ago