Telugu

కాంగ్రెస్ పల్లవికి…వైసీపీ చరణం..?

దేశంలో ఓట్ చోరి నడుస్తుంది, దాని ఫలితమే బీజేపీ విజయాలు, బీజేపీ తమకు అనుకులంగా లేని ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ఎన్నికల సంఘం ను బీజేపీ తన అరచేతిలో ఉన్న రాజకీయ అస్త్రంగా మార్చిందంటూ కాంగ్రెస్ బీజేపీ పై విరుచుకుపడుతుంది.

బీజేపీ ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి, ఎన్నికలలో తమ ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ఈ ఓట్ చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ప్రచారం సాగించారు.

ADVERTISEMENT

అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ దేశ వ్యాప్త ప్రచారాన్ని బీజేపీ కూడా తనదైన స్టైల్ లో తిప్పికొడుతోంది. బీజేపీ ఓట్ చోరి కి పాల్పడితే కర్ణాటక, తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా రాగలుగుతుంది.? వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఎలా ఓడిపోతుంది.? కేరళలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది.? అంటూ బీజేపీ రహిత రాష్ట్ర ప్రభుత్వాలను సాక్ష్యాలుగా చూపిస్తూ కాంగ్రెస్ విమర్శలకు ఆరోపణలకు ధీటైన కౌంటర్ ఇస్తుంది.

బీజేపీ ఎన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే అదే పల్లవితో రాజకీయం చేస్తూ, ఓట్ చోరీ నినాదం తో ర్యాలీలు నిర్వహిస్తుంది. అలాగే తాజాగా జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో మోడీ నీ సమాధి తవ్వి తీరుతాం, ఈ రోజు కాకపోతే రేపు అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నినాదాలు వివాదంగా మారగా అందుకు సోనియాతో సహా కాంగ్రెస్ మోడీకి క్షమాపణలు చెప్పాలంటు బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.

అదలాఉంటే, 151 నుంచి 11 పడిన వైసీపీ ఘోర ఓటమిని ఆ పార్టీ నాయకులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు, ఓటమిని అంగీకరించలేకున్నారు. గెలుపులో కలిసొచ్చిన ఈవీఎం లు ఓటమిలో మోసం చేశాయంటూ గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నేతలు.

పార్టీ అధినేత వైస్ జగన్ నుంచి పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరి నోటా ఒకే మాట…వైసీపీ ఓటమికి దోషులు ఈవీఎంలు. ఈవీఎం లను మేము నమ్మలేం దొర ఇక నుంచి బ్యాలట్ ఓటింగ్ ని ప్రవేశ పెట్టండి అంటూ వైసీపీ రాజ్యసభ నేత వైవి సుబ్బారెడ్డి సభలో ప్రసంగించారు.

ఏపీలో జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని, వాటి పై ఈసీ విచారణ నిర్వహించాలంటూ వైవి సుబ్బారెడ్డి వైసీపీ పాత పాటనే మరల అందుకున్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, బ్యాలట్ ఓటింగ్ సమీపంలో సీసీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలంటూ రాజ్యసభలో సుబ్బారెడ్డి సూచనలు చేసారు.

ఇలా కాంగ్రెస్ తన ఓటమిని ఓట్ చోరీ తో పక్కదారి పట్టిస్తున్నట్టుగానే వైసీపీ కూడా తన పార్టీ ఘోర ఓటమి అవమానాన్ని ఈవీఎం ల పై నెట్టి తప్పించుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాడుతున్న ఓట్ చోరీ పల్లవికి వైసీపీ ఈవీఎంల ట్యాపరింగ్ అనే చరణాన్ని జోడించి తమ పార్టీ ఓటమికి కుంటి సాకులు చూపిస్తూ తమ రాజకీయాన్ని ఇప్పటికి అలానే కొనసాగిస్తూ వస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After Bloody Romeo, Nani Wants a Clean Break

Nani seems ready to move away from the A-certificate zone, but he is not doing…

29 seconds ago

కనబడుట లేదు: 45 ఎకరాలు

ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి కనిపించుట లేదు. మా పెంపుడు కుక్క కనిపించుట లేదు.. వంటి వార్తలు తరచూ చూస్తూనే…

23 minutes ago