
ఈసారి జూన్ 4వ తేదీ చాలా చాలా దూరంగా కనిపిస్తోంది అందరికీ. క్షణమొక యుగంలా గడుస్తోందని ఓటమి అంచున ఉన్న వైసీపి నేతలే చెప్పుకుంటున్నారంటే, ఎన్నికలలో గెలిచి అధికారంలో చేపట్టబోతున్న టిడిపి, జనసేన, బీజేపీ నేతలు మరెంత ఆత్రంగా ఎదురుచూస్తుంటారో ఊహించుకోవచ్చు.
అధికార, ప్రతిపక్షాల గెలుపోటములు తెలిసే రోజు గాబట్టి అవి ఆతృతగా ఎఊదురు చూసినా అర్దం ఉంది. కానీ ఈసారి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా జూన్ 4 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే మార్పు కోసం వారు ఎంతగా తపించిపోతున్నారో అర్దం చేసుకోవచ్చు.
టిడిపి, జనసేనల పొత్తులు కుదిరినప్పటి నుంచే ఆ రెండు పార్టీలలో ఈసారి తప్పకుండా గెలుస్తామనే ధీమా కనబడింది. వాటితో బీజేపీ కూడా కలవడంతో ఆ ధీమా ఇంకా పెరిగింది. ఈ పరిణామాలతో అదే నిష్పత్తిలో జగన్మోహన్ రెడ్డిలో, వైసీపి నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.
పోలింగ్ తర్వాత టిడిపి కూటమికి పూర్తి నమ్మకం ఏర్పడటంతో చాలా నిశ్చింతగా ఉంది. అందుకే రీపోలింగ్ అడగటం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా చెప్పేశారు కూడా. కనుక ప్రమాణ స్వీకారం అంటూ టిడిపి నేతలు హడావుడి చేస్తారనుకుంటే వారు నిశబ్ధంగా ఉండిపోయి వైసీపిని చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు.
కానీ వైసీపి ఓడిపోబోతోందని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ఆ మాట బయటకు చెప్పుకోలేక, ఓటమికి సాకులు జాబితా ‘సిద్దం’ చేసి ఉంచుకుంటున్నారు. మరోపక్క ‘జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకి విశాఖలో జగన్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం’ చేస్తారంటూ ఏడుపు మొహాలతో చెప్పుకుంటుంటే చూసేవారు నవ్వాపుకోలేకపోతున్నారు.
“మేము ముహూర్తాలు పెట్టేసుకున్నాము మీదే ఆలస్యం…” అని వైసీపి చెపుతోంది కనుక ముఖేష్ కుమార్ మీనా కూడా కౌంటింగ్, ఫలితాల షెడ్యూల్ ప్రకటించేశారు.
జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల లోపుగా 111 నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సాయంత్రం 4 గంటలలోగా మరో 61 నియోజకవర్గాలవి, సాయంత్రం 6 గంటలలోగా మిగిలిన మూడు నియోజకవర్గాల ఫలితాలు కూడా ప్రకటించేస్తామని చెప్పారు. రాత్రి 8 గంటలలోగా 175/25 స్థానాల ఫలితాలు ప్రకటించేస్తామని చెప్పారు.
అంటే జూన్ 4న మధ్యాహ్నం 2 గంటలలోగానే వైసీపి, టిడిపి కూటమిలో ఏది గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందో తేలిపోతుందన్న మాట!
Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…
Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…