
ఇండియా – పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశంలో అందరి నోటా ఒక్కటే మాట “సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ”. గత నెల ఏప్రిల్ 22 న కాశ్మీర్ లోని పెహాల్గమ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రమూకల దాడిలో అమాయకులైన 26 మంది హిందూ పురుషులు ప్రాణాలు కోల్పోయారు. వారిని తమ కుటుంబసభ్యుల కళ్ళ ముందే కాల్చి చంపి ఆ మహిళల సింధూరాన్ని దూరం చేసారు ఉగ్రవాదులు.
అయితే నాడు ఆ అన్యాయాన్ని నిలదీసిన ఒక బాధిత మహిళ తో ఆ ఉగ్రవాదులు చెప్పిన ఒక్క మాట నేడు పాకిస్తాన్ కు యుద్ధం భయం ఏమిటో రుచి చూపించింది, ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో దాయాది దేశానికి మరొకసారి తెలిసొచ్చేలా చేసింది. ఇప్పుడు ఆ ఒకమాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
బాధిత మహిళ : నా భర్త తో పాటుగా నన్ను చంపేయండి…
ఉగ్రమూకలు: లేదు నిన్ను చంపము, వెళ్లి ‘మీ మోడీకి చెప్పుకోండి’…
భారతీయులు: అవును మా మోడీకి చెప్పుకున్నాం, ఆయన మీ కోసం S 400 , సుదర్శన చక్ర, ఐ.ఎస్.ఎన్. విక్రాంత్ ను పంపారు.
మోడీకి చెపితే ఏమవుతుందిలే, మహా అయితే దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాల ముందు మరొకసారి ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను దోషిగా నిలబెడుతుంది, మళ్ళీ శాంతి శాంతి అంటూ అదే ఓర్పు, అదే సహనంతో మౌనంగా ఉంటుంది అని ఆశించారు ఆ దుర్మార్గులు.
అయితే ఆ ‘ఓర్పుకి ఒక ఎక్స్ పైరీ డేట్’ ఉంటుందని, ఆ ‘సహనానికి ఒక పరిధి’ ఉంటుందని, ఆ ‘శాంతికి ఒక ఆయుధం’ వస్తుందని ఉగ్రవాదులతో పాటుగా పాకిస్తాన్ కు తెలిసొచ్చేలా ‘ఆపరేషన్ సింధూర్’ తో భారత ఆర్మీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదానికి గట్టి బదులు చెప్పింది. దీనితో కంగుతిన్న పాక్ ఇప్పుడు తన గోడు ఎవరికీ చెప్పుకోవాలో దిక్కుతోచక లబోదిబో మంటుంది.
కిందపడ్డా పై చెయ్యి మాదే అన్నట్టుగా, పాక్ ఆర్థిక పరిస్థితి కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ భారత్ మీద యుద్ధం చెయ్యడానికి కవ్వింపు చర్యలకు పాల్పడి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుంది పాక్. భారత దేశ సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి డ్రోన్లతో పాక్ సైన్యం చేసిన విచక్షణారహిత దాడులను భారత సేన సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది.
ఈ దాడుల నియంత్రణలో భారత ఆర్మీ వినియోగించిన S – 400 , ఐ.ఎస్.ఎన్ విక్రాంత్, సుదర్శన్ కీలక పాత్ర పోషించినట్టు అధికారిక సమాచారం. ముఖ్యంగా S 400… విషయానికొస్తే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలోనే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. 2018 అక్టోబర్ లో రష్యా నుంచి భారత్ ఈ S -400 కొనుగోలు చేసింది.
అయితే ఈ వాయు క్షిపణి దాదాపు 400 కీ.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగంతోనే భారత ఆర్మీ పాక్ దాడులను భారత భూభాగంలో పడకుండా ఆపగలిగింది, అలాగే వాటిని నిర్వీర్యం చేయగలిగింది. అయితే వీటి కొనుగోలు విషయంలో నాడు మోడీ తీసుకున్న చొరవ, తెగింపు నేడు దేశాన్ని కాపాడిందంటూ మోడీ పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
పాక్ , చైనా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలను సైతం భారత డిఫెన్స్ సిస్టమ్ మట్టి కరిపించింది. దీనితో ఇన్నాళ్ళుగా దేశ ప్రజల నుంచి టాక్స్ ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మోడీ సింహ భాగం డిఫెన్స్ సిస్టమ్ బలోపేతానికి వెచ్చించారు అనే విమర్శలకు నేడు సరైన సమాధానం దొరికినట్టయింది. ఈ నేపథ్యంలో “భోలో భారత్ మాత కీ జై”….జై హింద్..నినాదాలతో దేశం హోరెత్తుతోంది.
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…