
2014 ప్రారంభం నుంచి ఈ సంవత్సరం జూలై వరకూ బుధవారం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతుండగా, ట్రాఫిక్ పోలీసు వర్గాలు ‘బుధవారం భయం’ను తోసిపుచ్చుతున్నాయి. ఇది కేవలం కాకతాళీయం కావచ్చని, ఇప్పటివరకూ రోడ్ల ప్రమాదాలపై ఇటువంటి అంచనాలకు శాస్త్రీయత లేదని బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ ఆర్ హితేంద్ర వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇదే రకమైన గణాంకాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా బుధ, గురువారాల్లో గరిష్ఠ సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయని, దీని వల్ల కూడా ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండవచ్చని ట్రాఫిక్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని విభేదిస్తున్న వారూ ఉన్నారు. అధిక వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే, ట్రాఫిక్ నిదానంగా కదులుతూ, ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని మరికొందరు అంటున్నారు.
ఇక నాలుగైదేళ్ల క్రితం లేని ‘వీక్ డేస్ పార్టీయింగ్’ మెట్రో నగరాలను ఊపుతోందని ఇటీవల తయారైన ఓ డాక్యమెంటరీ వెల్లడిస్తోంది. గతంలో శుక్రవారం రాత్రి నుంచి పబ్ కల్చర్ ప్రారంభమవుతుండగా, ఇప్పుడు బుధ, గురువారాలు సైతం యువత పబ్బులను వదలడం లేదన్నది ఈ డాక్యుమెంటరీ సారాంశం. అది కూడా బుధవారం ప్రమాదాలు పెరిగేందుకు ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నగరాల రహదారులపై తెల్లవారుఝాము ప్రమాదాలు అధిక సంఖ్యలో ఉంటుండగా, ఆపై సాయంత్రం 6 నుంచి రాత్రి 9 మధ్య జరుగుతున్న ప్రమాదాలు అధికంగా ఉన్నట్టు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ముఖ్య గణాంకాల అధికారి రంజన్ ముఖర్జీ వెల్లడించారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…