
వివాదం, ఆర్జీవీ రెండు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివి. ఈ రెండిటిని ఎలా అయితే వేరు చేసి చూడాలేమో అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వివాదాలను వేరు చేసి చూడలేము.
ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగేళి, సత్య వంటి సినిమాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ గా పేరు సంపాదించుకున్న వర్మ ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం, వంగవీటి, పవర్ స్టార్ అంటూ టాక్ ఆఫ్ వివాదం అనే ఖ్యాతి గడించారు.
తన వితండ వాదనకు లాజిక్స్ ను జోడించి తన మేధావి తనాన్ని ప్రదర్శించే ఆర్జీవీ పుష్ప విజయంలోనూ వివాదాన్నే ఎంచుకున్నారు. ది బిగ్గెస్ట్, మెగాఏస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ అంటూ మెగా అభిమానులను రెచ్చకొట్టేలా తనదైన శైలిలో పుష్ప థియేటర్లో జరుగుతున్న జాతర మీద స్పందించారు.
అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసారు ఆర్జీవీ.
అయితే అసెంబ్లీ వేదికగా బన్నీతో పాటుగా సినీ సెలబ్రెటీల మీద రేవంత్ రెడ్డి చేసిన కౌంటర్ వ్యాఖ్యలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టాలీవుడ్, ప్రభుత్వం పై తమ విధేయతను తెలియచేయడానికి ముఖ్యమంత్రి వద్దకు క్యూ కట్టారు.
అలాగే తెలంగాణ మంత్రులు కూడా పుష్ప సినిమా మీద, అల్లు అర్జున్ ప్రవర్తన మీద అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ టాలీవుడ్ నుండి కానీ అల్లు కుటుంబం నుండి కానీ ఎటువంటి ఎదురు దాడి జరగలేదు. చివరికి బన్నీ ఇంటి మీద రాళ్ల దాడి జరిగినప్పటికీ సంయమనం పాటించండి అంటూ అల్లు అరవింద్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.
అయితే ఎక్కడ వివాదం ఉంటే అక్కడ తన లాజిక్స్ తో వాలిపోయే ఆర్జీవీ బన్నీ చుట్టూ ఇన్ని వివాదాలు తిరుగుతున్నప్పటికీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తన వెకిలి చేష్టలు, వెర్రి వేషాలు ఏపీలో మాదిరి ఇక్కడ నడవవన్న విషయం గ్రహించిన ఆర్జీవీ రేవంత్ సర్కార్ తో ఢీ కొట్టే విషయంలో ముందడుగు వేయలేదు.
ఈ విషయంలో ఎవరైనా ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే సంకేతాన్ని రేవంత్ సర్కార్ చాల బలంగా ఇండస్ట్రీ వర్గాలకు చెప్పగలిగింది. దీనితో రామ్ గోపాల్ వర్మ కూడా తన పరిధి దాటి ముందుకు వచ్చే సాహసం చెయ్యలేకపోతున్నట్టు ఉన్నారు.
ఒక వేళ ఆ హద్దు గీత దాటితే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో కే తిప్పలు తప్పలేదు. ఇక ఆర్జీవీ ఎంతా అనేది ఆయనకు అవగాహన రావడంతోనే సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారు అంటూ ఆర్జీవీ మౌనం మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలంగాణ ప్రభుత్వం తన గట్టి వైఖరితో ఆర్జీవీ వంటి వారిని కూడా కట్టడి చేయగలుగుతుంది కానీ ఏపీ లో కూటమి ప్రభుత్వం మాత్రం తన మెతకతనంతో ఇప్పటికి ఇటువంటి వారిని అదుపు చేయలేకపోతోంది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
The OTT premiere of Pradhama Drishtiya Kuttakkar on Netflix has sparked discussion among viewers. The…
The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…