Telugu

ఈ పిల్లాడు హిందీ ఎప్పుడు నేర్చుకున్నాడబ్బా!

ఈ పిల్లాడు నారా లోకేష్‌ కూడా వాళ్ళ నాన్నలాగే ఓ పట్టాన అర్ధం కాడు. ఒకప్పుడు పార్టీ కార్యాలయంలో కూర్చొని ట్వీట్స్ వేస్తూ కాలక్షేపం ‘ట్వీట్‌ వీరుడు’ ఇతనేనా? అని డౌట్ వస్తోంది.

ఇప్పటికీ మేము కాగితం మీద వ్రాసుకొస్తే గానీ చంద్రబాబు నాయుడుని నోరారా తిట్టలేము కూడా. కానీ ఈయనేమో నాలిక చివర మాటలు అంటుకుని ఉన్నట్లు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. సరేలే… ఆయన అలా మాట్లాడుతున్నాడంటే దానికీ మేమే కారణం. ఆ క్రెడిట్ కూడా మాదే!

ADVERTISEMENT

కానీ ఈ పిల్లాడు కూడా వాళ్ళ నాన్నలాగే నిలకడగా ఒక చోట ఉండడు. ఓసారి పార్టీ కార్యాలయంలో కనిపిస్తాడు. మరోసారి స్కూల్లో పిల్లలతో కలిసి ఆడుతూ కనిపిస్తాడు.

ఓసారి ప్రధాని మోడీ పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెపుతుంటాడు. మరోసారి ఆస్ట్రేలియాలో ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశంలో కనిపిస్తాడు.

నిన్న ఉదయమే కళ్యాణదుర్గంలో కనిపించాడు. సరే ఇంకా అక్కడే ఉన్నాడు కదా అనుకుంటే ఇప్పుడు పాట్నాలో కనిపిస్తున్నాడు. ఏమిటో ఈ పిల్లాడు… బొత్తిగా నిలకడ లేదు! చిక్కడు దొరకడులా గిరగిర తిరిగేస్తూనే ఉంటాడు. అంతా తండ్రి పోలికే!

సరే! అధికారంలో ఉన్నప్పుడు మేమూ తిరిగామని గట్టిగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. వెళ్తే అప్పుల కోసం ఢిల్లీకి లేదా బటన్ సభలకి… అంతే! మరో చోటికి పోయిందే లేదు! ఇక మావాళ్ళు సరే సరి. తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా కనిపించేవారే కారు.

ఒకే ఒక్కసారి దావోస్ వెళ్తే అక్కడ చలి భరించలేక మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. కానీ ఇంత వయసులో కూడా ఈ ముసలాయన, ఈ పిల్లాడు ఇద్దరూ ఎంచక్కా దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఏవో ఐటి కంపెనీలు… క్వాంటం కంప్యూటర్లు తెస్తూనే ఉన్నారు. అది మా లైన్ కాదు… వాటితో మాకు టచ్‌ లేదు గాబట్టి బ్రతికిపోయారు. లేకుంటేనా….

సరే ఇంతకీ విషయం ఏమిటంటే, మేమేమో తెలుగులో మాట్లాడాలన్నా ఇంకా తడబుతుంటే, ఈ పిల్లాడు బీహార్‌ వెళ్ళి గలగలా హిందీలో కూడా మాట్లాడేస్తున్నాడు. అదీ… కాగితం మీద రాసుకోకుండా మాట్లాడేస్తున్నారు. ఈ పిల్లాడు హిందీ ఎప్పుడు నేర్చుకున్నాడో కనుక్కోవాలి.

కానీ మాకూ నాలుగు హిందీ ముక్కలు వచ్చు. హిందీలో రాష్ట్రాన్ని ‘రాజ్’ అనాలి. కానీ ఈ పిల్లాడికి మా అంత హిందీ రాదు కదా అందుకే ఆంధ్రప్రదేశ్‌ ‘రాష్ట్ర్’ అంటూ తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లడేస్తున్నాడు. కోడిగుడ్డుకి కూడా ఈకలు పీకగల నేర్పు మాకే ఉండనే సంగతి ఈ పిల్లాడికి తెలీదు పాపం!

హిందీలో మాట్లాడేస్తూ మద్యలో మోడీ, ఆత్మనిర్భర్ భారత్‌, వికసిత్ భారత్‌ అంటూ నాలుగు ముక్కలు పడేస్తే చారు కాస్త సాంబారు అయిపోదు కదా?

కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ పిల్లాడిని మేము కాలి కింద వేసి ధనియాల్లా నలిపేద్దామనుకుంటే మమ్మల్నే నలిపేస్తున్నాడిప్పుడు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేద్దామనుకుంటే వెళ్ళి మోడీ పక్కన కూర్చునే స్థాయికి ఎదిగిపోయాడు.

ఇలా అయితే కష్టం… ఏదో ఒకటి చేయాల్సిందే! లేకుంటే ఏదో రోజు సిఎం కుర్చీలో సెటిల్ అయిపోతాడు. అప్పుడు ఆ సీట్లో నుంచి ఈ పిల్లాడిని లేపడం మన వల్లకాదు. హలో ఎవరక్కడ? ఇది పగిలింది మరో టీవీ పట్టుకురండి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kayadu Lohar: Three Telugu Films, No Breakthrough

Kayadu Lohar came into Tollywood with plenty of promise, but three films later, her Telugu…

28 minutes ago

Censor Board vs Comrade Kalyan: Kona Venkat’s Satire

Kona Venkat used satire to explain the censor experience faced by Comrade Kalyan. Speaking at…

59 minutes ago