
కేసీఆర్ ఓటమిని కాంక్షించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ఎన్నికల పోటీనుంచి విరమించుకుని కాంగ్రెస్ కోసం త్యాగం చేసాను అంటూ ప్రచారం చేసుకున్న వైస్ షర్మిల ఇప్పుడు తన త్యాగానికి ఫలితం దక్కి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయినా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కూడా మచ్చుకైనా షర్మిల పేరు వినపడలేదు.
అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించలేదా?లేక అసలు వైస్ షర్మిల చేసింది త్యాగమే కాదని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యిందా అనే సందేహం కలుగుతుంది. పార్టీ విలీనం కోసం తల్లితో కలిసి హస్తిన దాక వెళ్లిన షర్మిలకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. పార్టీని వాడుకుని పదవులు అనుభవించి, లక్షల కోట్లు వెనకేసుకొని తిరిగి అదే పార్టీపై వైస్ జగన్ తో కలిసి విషం చిమ్మిన షర్మిల రాజకీయ అవకాశవాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం మరిచినట్టు లేదు.
అందుకే “ముల్లును ముల్లుతోనే తీయాలి” అనే సామెత మాదిరి కాంగ్రెస్ పై చిమ్మిన విషాన్ని వారి నోటితోనే తుడిచేసి అవకాశ వాదానికి అవకాశ వాదంతోనే బదులిచ్చారు కాంగ్రెస్ అధిష్టానం.ఎన్నికలలో పోటీ చేసినా వచ్చే ఫలితమేమిటో ముందుగానే ఊహించిన షర్మిల ఏపీలో తల్లి విజయమ్మకు జరిగిన అవమానమే ఇక్కడ తెలంగాణలో తాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించి త్యాగాల పేరుతో సైడ్ అయ్యిపోయారే కానీ అది త్యాగం కాదు అవకాశవాదం అనేది రేవంత్ వర్గీయుల ఆరోపణలు.
ఏపీ – తెలంగాణ రాజకీయాల మధ్య చిక్కుకుని ఆడ పిల్లా, ఈడ పిల్లా కాకూండా పోయినట్టు ఇప్పుడు కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల మధ్య చిక్కుకుని అటు ప్రతిపక్షంలోను ఇటు అధికార పక్షంలోను లేకుండా మిగిలిపోతాననే భయంతోనే షర్మిల పోటీ నుండి విరమించుకున్నారనే వాదనే తెలంగాణలో బలంగా వినపడుతుంది.ఆశించిన పార్టీ గెలిచినప్పటికీ తెలంగాణలో షర్మిల జాడ కనపడకుండా పోయింది, ఏమైపోయావో…అంటూ పాట అందుకుంటున్నారు షర్మిలక్క ఫ్యాన్స్.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…