
వైసీపీ ఓటమితో జగన్ రాజకీయ చదరంగానికి చెక్ పడినట్టే అనుకున్న కూటమి నాయకులకు జగన్ 2.0 ని పరిచయం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఒక్క ఓటమి తమ విధ్వంసకర ఆలోచనలను వెనక్కి నెట్టలేదు, తమ వికృత చేష్టలను కట్టడి చెయ్యలేదు అనే విధంగా జగన్ తన పర్యటనలను రసాభాసగా మలుస్తున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటించకుండా, అధికారులు ఇస్తున్న నింబంధనలను అనుసరించకుండా ఇష్టానురీతిగా వైస్ జగన్ తన పర్యటనలకు ప్రణాళికలు వేస్తున్నారు. 500 వందల మందికి మించి అనుమతి లేదు అంటే తన బలప్రదర్శన కోసం ఆ సంఖ్యను 5 వేలు చేస్తున్నారు.
ర్యాలీలకు, రోడ్డు షో లకు అనుమతి లేదు అంటే పార్టీ క్యాడర్ను వెనకేసుకొని, నాయకులను ముందేసుకుని ర్యాలీలు, రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు. చివరికి సొంత పార్టీ శ్రేణులకు ప్రమాదం జరిగినా పట్టించుకునే పరిస్థితిలో లేక ప్రభుత్వం భద్రత కలిపించడంలో ఫెయిల్ అయ్యింది అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
వారానికో సారి ఎదో కారణంతో బయటకు రావడం, వేలాదిగా వైసీపీ క్యాడర్ ని సమీకరణ చేయడం, ఇక అటు పై క్యాడర్ ను రెచ్చకొట్టడం, ప్రభుత్వాన్ని దూషించడం, అధికారులను బెదిరించడం జగన్ రాజకీయ చదరంగంలో భాగమయిపోయాయి. జగన్ ఆడే ఈ రాజకీయ చదరంగంలో చివరికి పావులుగా సమిధులయ్యేది ప్రజలా.? ప్రభుత్వ అధికారులా.? లేక పార్టీ కార్యకర్తలా.?
జగన్ చేస్తున్న ఈ విధ్వంశకర రాజకీయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు అత్యంత ప్రమాదకరం. ఈ రాజకీయంతో జగన్ రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించి తద్వారా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి అడ్డుకట్ట వెయ్యాలని భావిస్తున్నారా.? తన హయాంలో జరగని పారిశ్రామిక ప్రగతి కూటమి ప్రభుత్వ హయాంలో ముందుకెళ్లడం వైసీపీ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్దకంలోకి నెట్టేస్తుంది.
మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అన్న సామాన్యుడి ప్రశ్న, పారిశ్రామికవేత్త భయమే వైసీపీ పెట్టుబడిగా మారిపోయింది. ఆ భయాన్ని, ఈ ప్రశ్నను ప్రజలతో పాటు ప్రభుత్వం, అధికారులు కూడా ఎప్పటికప్పుడు గుర్తించాలి అనేదే వైసీపీ లక్ష్యంగా మారిందా అన్నట్టుగా వైసీపీ రాజకీయం నడుస్తుంది. దీని ఫలితంగా అటు రాష్ట్ర ప్రజలు, ఇటు పార్టీ కార్యకర్తలు ఇద్దరు జగన్ ఆడే రాజకీయ చదరంగంలో పామువులుగా సమిధులవ్వక తప్పదు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…