హూ కిల్డ్ బాబాయ్? బిగ్ బాస్ ఎవరు?

రప్పా రప్పా తర్వాత ఇప్పుడు ఏపీలో అంత పాపులర్ అవుతున్న పదం ‘బిగ్ బాస్.’

మద్యం కుంభకోణం కేసులో ‘అంతిమ లబ్దిదారు’ అని కొందరు సాగదీసి చెపుతుంటే, మరికొందరు సింపుల్‌గా ‘బిగ్ బాస్’ అని ‘క్యాచీ టైటిల్‌’ పెట్టి ఈ మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఎవరికీ రాని ధర్మ సందేహం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి వచ్చింది. ‘ఇంతకీ ఈ బిగ్ బాస్ ఎవరు?’ అని ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏమైనా బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పారా? లేదు కదా?మరి బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్లు టీడీపి నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు?ఆ బిగ్ బాస్ సిఎం చంద్రబాబు నాయుడే కావచ్చు కదా?

పవిత్రమైన న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగుతున్నప్పుడు ఎవరు పడితే వారు నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. పూర్తి సాక్ష్యాధారాలు ఉంటేనే మాట్లాడాలి,” అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఈ కేసులో జగన్‌ బిగ్ బాస్ కాదంటున్నారంటే మద్యం కుంభకోణం జరిగిందని, కానీ బిగ్ బాస్ ఎవరో తెలీదని చెపుతున్నట్లే కదా? ఆ బిగ్ బాస్ ఎవరో ఆయనే చెప్పేసి ఇటువంటి నీలాపనిందల నుంచి జగన్‌ని కాపాడుకోవచ్చు కదా?

అయినా ఇన్ని వేల కోట్ల మద్యం కుంభకోణం జరుగుతుంటే ‘బిగ్ బాస్’ కళ్ళు మూసుకొని, చేతులు ముడుచుకొని కూర్చోరు కదా?అసలు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేయడంలో అనుభవం, నేర్పు వైసీపీలో ‘బిగ్ బాస్’కు తప్ప మరెవరికి ఉన్నాయి?

అయినా జగన్‌ హయంలో ఈ కుంభకోణం జరిగితే బిగ్ బాస్ జగనే అవుతారు కానీ చంద్రబాబు నాయుడు ఎలా అవుతారో శ్రీకాంత్ రెడ్డే చెప్పాలి.

మొన్న హైదరాబాద్‌ ఫామ్‌హౌసులో దొరికిన రూ.11 కోట్లు నగదుని క్లెయిమ్ చేసుకోవడానికి వైసీపీలో ఎవరూ ఎందుకు ముందుకు రాలేదు?రేపు మరో వందో వెయ్యి కోట్లో దొరికినా ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా వదిలేస్తారా? అనే ప్రశ్నలకు కూడా శ్రీకాంత్ రెడ్డే సమాధానం చెపితే బాగుంటుంది.

“అసలు మద్యం కుంభకోణమే జరుగలేదు. ఇదో భూటకపు కేసు. దీంతో జగన్‌పై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారందరూ ఆణిముత్యాలే,” అని వైసీపీ నేతలు తీర్పులు చెప్పేసుకొని, ఒకరికొకరు ‘కాండక్ట్ సర్టిఫికెట్స్’ జారీ చేసుకుంటున్నప్పుడు, అదేవిదంగా టీడీపి నేతలు కూడా ఈ కేసులో ‘బిగ్ బాస్’ జగనే… నేడోరేపో అరెస్ట్‌ కావడం తధ్యమని చెప్పుకుంటున్నారని సరిపెట్టుకోవచ్చు కదా?

కానీ ఈ కేసు మాత్రమే కాదు… అక్రమాస్తుల కేసు కావచ్చు… వివేక హత్య కేసు కావచ్చు.. ఏ కేసునైనా న్యాయస్థానాలే తేలుస్తాయి.

బాహుబలి-2 విడుదలయ్యే వరకు రెండుమూడేళ్ళ పాటు యావత్ దేశ ప్రజలు “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అని తలలు పట్టుకున్నట్లుగానే, ఈ మద్యం కుంభకోణం కేసులో బిగ్ బాస్ ఎవరో న్యాయస్థానాలు కనిపెట్టి చెప్పేవరకు ‘బిగ్ బాస్ ఎవరు?హూ కిల్డ్ బాబాయ్?వంటి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి.

ఇంతవరకు ఏ కేసులోనూ కోర్టులు ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కనుక ఇలాంటి మాటలను లైట్ తీసుకోవాలే తప్ప రప్పా రప్పా అని ఆవేశపడిపోకూడదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

3 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

4 hours ago