
భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో మతం, ఒక్కో కులంలో భిన్న సంప్రాదాయాలతో వివాహాలు జరుగుతుంటాయి. వివాహ పద్దతులలో ఒకదానికి మరొకదానికి పొంతన లేకపోయినా దేనికదే గొప్పగా ఉంటుంది. అన్నిటిలో భారతీయ కనపడుతుంది.
అయితే భారతీయుల వివాహాలలో సాంప్రదాయాల స్థానంలో ఇప్పుడు ఆడంబరాలు పెరిగిపోయాయి. ఒకప్పుడు వివాహం అంటే ఓ పవిత్రమైన కార్యక్రమంగా సాగేది. కానీ నేడు అదో ఆడంభరమైన వేడుకగా మార్చేసుకున్నాము.
మారుతున్న కాలంతో పాటు ఆలోచనలు, పద్దతులు అన్నీ మారడం సహజమే. కానీ అసలు కంటే కొసరే బాగుంటుందన్నట్లు అవసరం లేని ఆడంభారాలు, హంగులు, వేడుకలు జోడించుకుంటూ అదే గొప్ప విషయమన్నట్లు అందరూ ముందుకు సాగిపోతున్నారు.
అయితే మన తెలుగువారి వివాహ పద్ధతి, సాంప్రదాయాలను చూసి ముచ్చటపడే విదేశీ యువతులు అనేకమంది ఉన్నారు. విదేశాలలో పనిచేస్తున్న తెలుగు యువకులను ప్రేమించి, మన రాష్ట్రానికి వచ్చి మన సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
అంటే మన సంప్రాదాయాలు, ఆచార వ్యవహారాల గొప్పదనాన్ని మనం గుర్తింఛి గౌరవించలేకపోతున్నా విదేశీయులు గుర్తించి గౌరవిస్తున్నారన్న మాట!
ఇటీవల మన రాష్ట్రంలో ఓ విదేశీ యువతీ మన తెలుగు యువకుడిని మన పద్దతిలోనే పెళ్ళి చేసుకొని మురిసిపోయింది. ఆమె బంధువులు కూడా భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి బుట్టలో కూర్చున్న ఆమెనూ పెళ్ళి మండపంకి మోసుకు వచ్చారు. పెళ్ళిలో ఈ వేడుకలని ఆమె చాలా ఆస్వాదిస్తూ ప్రియుడి చేత మూడు ముళ్ళు వేయించుకుంది.
కానీ ఆమె వంటి విదేశీయులు, వారిని వివాహం చేసుకుంటున్నవారు కూడా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ప్రేమకు కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, భాషలు అడ్డుకావని చెప్పుకోవడం గొప్పగానే ఉంటుంది. ఒక కులం లేదా మతానికి చెందినవారిలోనే ఒక్కొక్క వర్గానికి ఒక్కో రకమైన జీవన, ఆలోచన, ఆహార, వ్యవహార విధానాలు ఉంటాయి.
ఒకే రకమైన జీవన విధానం ఉంటే భార్యాభర్తలు సర్దుకుపోయి జీవించడం సులువని మన పెద్దలు ఈ వివాహ కట్టుబాట్లు ఏర్పాటు చేశారు తప్ప కులపిచ్చి, మత పిచ్చితో కాదు.
కనుక విదేశీ యువతీ యువకులు, మన భారతీయుల్ని మనసారా ప్రేమించి పెళ్ళి చేసుకుంటే పర్వాలేదు. కానీ ఈ ముచ్చట్ల కోసమే పెళ్ళి చేసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…