
రామాయణ, మహాభారతాల సారాంశం పామరులకు సైతం సులువుగా అర్ధమయ్యేందుకు అనేక పిట్ట కధలు జోడించి చెపుతుంటారు. చివరికి అవి కూడా వాటిలో భాగమైపోయాయి. అది వేరే విషయం.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాంటి పిట్ట కేసులు అసలు కేసులను ముందుకు సాగనీయకుండా కట్టడి చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు కేసుని మరిపింపజేస్తున్నాయి కూడా.
2019 ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. అంటే నేటికి దాదాపు 7 సం.లన్న మాట. అంతూపొంతూ లేకుండా ఈ కేసు విచారణ ముగించడానికి సుప్రీంకోర్టు స్వయంగా గడువు విధిస్తే, మరో పిట్ట కేసులు వేస్తూ సుప్రీంకోర్టు చేతనే వాటిని విచారించేలా చేస్తూ ఆ గడువు పొడిగించడం మామూలు విషయం కానే కాదు.
2023 జూలై నెలాఖరుకల్లా ఈ కేసు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి నేటి వరకు సుప్రీంకోర్టు పలుమార్లు ఈ కేసులో పిట్ట కేసులను విచారిస్తూనే ఉంది.
చట్టంలో లొసుగుల పట్ల లోతైన అవగాహన, జాతీయ స్థాయిలో రాజకీయ పరపతి ఉంటే తప్ప ఈ కేసుని ఇంతకాలం సాగదీయడం సాధ్యం కాదు.
తాజాగా తెలంగాణలో సీబీఐ కోర్టు తదుపరి విచారణ కొనసాగించాలని ఆదేశించింది. దీనిని వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టు సవాలు చేయగా సీబీఐ అభ్యర్ధన మేరకు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. అయితే ఈ కేసుని ఇంకా ఎన్నేళ్ళపాటు విచారణ జరుపుతారంటూ సుప్రీంకోర్టు సీబీఐకి చురకలు వేసింది. ఇలాంటి చురకలకు సిబీఐ అతీతం. కనుక దానిని బాధించకపోవచ్చు.
కానీ దేశంలో ఉగ్రవాదులు దాడులు జరిపి ప్రజలు లేదా సైనికులను బలి తీసుకుంటే జాతీయ నిఘా సంస్థ (ఎన్ఐఏ) ఒకటి రెండేళ్ళలోపే వారిని పట్టుకొని న్యాయస్థానం ముందు ఉంచుతుంటుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రముఖుడైన వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన తర్వాత రెండు ప్రభుత్వాలు మారాయి. కానీ హంతకులు ఎవరో నేటికీ నిర్ధారించలేకపోవడం విడ్డూరమే కదా?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…