Telugu

కూటమి అభివృద్ధి మంత్రం…వై నాట్ పులివెందుల.?

గత వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అనే నినాదం తో ముందుకెళితే నేటి కూటమి ప్రభుత్వం వై నాట్ పులివెందుల అంటూ ముందుకొస్తుంది. అభివృద్ధి పనులు చేయడానికి సీఎం సొంత నియోజకర్గమైన కుప్పం కి ఎంత అర్హత ఉందో, ఉపముఖ్యమంత్రి పవన్ నియోజకర్గమైన పిఠాపురానికి ఎంత ప్రాధాన్యత ఉందో,

మంత్రి లోకేష్ మంగళగిరి కి ఎంత అవకాశం ఉందో అదే స్థాయి అభివృద్ధికి వై నాట్ పులివెందుల అంటూ కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రత్యర్థి పార్టీ అధినేత జగన్ సొంత నియోజకర్గమైన పులివెందులకు కూడా కూటమి ప్రభుత్వం అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. దీనితో గత కొన్ని రోజులుగా వైసీపీ రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయిందనే చెప్పాలి.

ADVERTISEMENT

ఒకపక్క కూటమి ప్రభుత్వం రోజుకో కార్యక్రమంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తమ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు రెండు కళ్ళు అన్నట్టుగా ముందుకు సాగుతుంది. ప్రభుత్వం అంటే కేవలం బటన్ నొక్కడం మత్రమే కాదని భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక వ్యవస్థ అని నిరూపిస్తుంది కూటమి ప్రభుత్వం.

అందులో భాగంగానే మొన్న మదనపల్లి కేంద్రంగా సాగిన అభివృద్ధి పనులు, నిన్న బుర్రపాలెం లో మొదలైన 3D ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం, నేడు కడప జిల్లా పొద్దుటూరు లో నిర్వహించిన జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాల శ్రీకారం…ఇలా రోజుకో అభివృద్ధి కార్యక్రమంతో, ప్రగతి మంత్రంతో, ఉపాధి హామీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకొస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో వైసీపీ రాజకీయంగా పూర్తిగా నిస్సహాయంలోకి వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయాలని అభివృద్ధి పనులను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. నీటి ప్రోజెక్టుల నుంచి భోగాపురం ఎయిర్ ఫోర్ట్ వరకు, రాజధాని అమరావతి నిర్మాణాల నుంచి పోలవరం పూర్తి వరకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

మరోవైపు వైసీపీ పార్టీ రాజకీయ విధానాలతో విసిగివేసారిన కొంతమంది వైసీపీ నాయకులు పార్టీకి దండం పెట్టి రాజీనామా పేరుతో కొందరు, సస్పెన్షన్ వేటుతో మరికొందరు వైసీపీ కి దూరమవుతున్నారు. చిన్న శ్రీను రాజీనామాతో ఇప్పటికే విజయనగరం వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితికొచ్చింది. ఇక్కడ స్థానిక నేతలు, క్యాడర్ సైతం ఒక్కొక్కరుగా వైసీపీ ఫ్యాన్ కి గుడ్ బై చెప్పి టీడీపీ సైకిల్ ఎక్కేస్తున్నారు.

ఇక ఇటు గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలా ఒకపక్క వైసీపీ, పార్టీ నాయకుల తిరుగుబాటుతో రాజకీయంగా బలహీనపడుతుంటే మరోపక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో భవిష్యత్ రాజకీయం పై కుదేలవుతోంది.

నేడు కూటమి ప్రభుత్వం వేస్తున్న ఒక్కో అభివృద్ధి శంకుస్థాపన రేపటి రోజున వైసీపీ కి రాజకీయ సమాధిగా మారే ప్రమాదం లేకపోలేదు. పార్టీ చూడం, ప్రాంతం చూడం…అన్నట్టుగా సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పం కి కృష్ణ నీళ్లు ఇచ్చినట్టు, డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం లో ఒక డంపింగ్ యార్డ్ ను పీఠికాపురం అనే ఒక సుందరమైన పార్క్ గా మార్చినట్టుగా,

మంత్రి లోకేష్ నియోజకర్గమైన మంగళగిరి నిడమర్రు లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల ను నిర్మించినట్టుగా, రేపు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా దశాబ్దాల పులివెందుల ప్రజల తాగు నీటి కష్టాలకు చెక్ పెట్టనుంది కూటమి ప్రభుత్వం.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధి పనులు, వై నాట్ పులివెందుల నినాదం జగన్ 2.0 ఆశలను ఆవిరిచేసేలా కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rakul Breaks Silence And Sets The Record Straight

Rakul Preet Singh has broken her silence over reports linking her to an Income Tax…

28 minutes ago

IND vs WI T20Is: Where to Watch, Pitch Report & Playing XI?

India and West Indies will begin their five match T20I series on Tuesday, October 6,…

58 minutes ago