
ఇన్‌స్టాంట్, ఫిల్టర్ కాఫీ… ఏది రుచి? అని అడిగితే దేని రుచి దానిదే అంటారు కానీ ఫిల్టర్ కాఫీకి మొగ్గు చూపేవారు ఎక్కువ. అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఇన్‌స్టాంట్ కాఫీ వంటి ఇతర పార్టీల రెడీమేడ్ నాయకులు మంచిదా లేకా దశాబ్దాల పాటు పార్టీలో ఫిల్టర్ అయ్యి నేతలుగా ఎదిగిన కార్యకర్తలు మంచిదా? అంటే ఫిలర్ట్ నేతలు, కార్యకర్తలే మేలు.
అటువంటి నిబద్దత కలిగిన నేతలు, కార్యకర్తలు టీడీపి, జనసేన, బిజేపి, వైసీపీ నాలుగు పార్టీలవి భిన్న సిద్దాంతాలు, వైఖరులు. వాటిని పూర్తిగా నమ్మేవారే ఆయా పార్టీలను అంటిపెట్టుకొని ఉన్నారు. కనుకనే ఆ పార్టీలు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి బిజేపిలోకి మళ్ళీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి మారిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చెప్పిన ఈ మాటలు వింటే పార్టీ విధానాలు, ఆలోచనా ధోరణి, నాయకత్వం పట్ల నిబద్దత లేనివారిని చేర్చుకున్నా నష్టమే తప్ప లాభం ఉండదని అర్ధమవుతుంది.
“నేను కడియం శ్రీహరితో విభేదించి బిజేపిలోకి వెళ్ళాను. కానీ ఆ పార్టీలో ఉన్నా నాకు కేసీఆర్ అంటే చాలా గౌరవం. అందుకే ఏనాడూ నేను బీఆర్ఎస్ పార్టీ నేతలెవరినీ విమర్శించలేదు. కడియం బయటకు వెళ్ళిపోగానే నేను తిరిగి వచ్చేశాను,” అని అరూరి రమేష్ అన్నారు.
అంటే ఒక పార్టీ నేతకి సమస్య ఎదురైతే వేరే పార్టీలోకి వెళతాడు కానీ ఆ పార్టీ పట్ల చిత్తశుద్ది ఉండదు. కనుక అవకాశం చిక్కితే మళ్ళీ పార్టీ మారడం ఖాయం. వారు అవసరార్ధం చేరుతుంటారు.
పార్టీలు కూడా వారిని కండువాలు కప్పి చేర్చుకుంటాయి. వారి రాకతో పార్టీ బలపడిందని ఆత్మవంచన చేసుకుంటాయి. కొందరి విషయంలో అది నిజం కావచ్చు. కానీ చాలా మంది విషయంలో తలనొప్పులే ఎక్కువగా ఉంటాయి. ముగింపు ఇలాగే ఉంటుంది.
కనుక ఇతర పార్టీల రెడీ మేడ్ నేతలు, కార్యకర్తలను నమ్ముకోవడం కంటే పార్టీ పట్ల ప్రేమ, వీరాభిమానం, నమ్మకం ఉన్నవారికే ప్రాధాన్యం ఈయడం చాలా మంచిది. అటువంటివారే కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటారు. టీడీపి, జనసేన, బిజేపి, కాంగ్రెస్, వైసీపీ వంటి పార్టీలకు ఇటువంటి నిబద్ధత కలిగిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వక వాలంటీర్లను నమ్ముకున్న అధికారం కోల్పోయింది. కానీ ఫిల్టర్ కాఫీ వంటి నేతలు, కార్యకర్తలను నమ్ముకున్న టీడీపి, జనసేన, బిజేపిలు వారి సహాయసహకారలతోనే అధికారంలోకి వచ్చాయి.
కనుక ఇన్‌స్టాంట్ కాఫీ లాంటి ఇతర పార్టీలకు చెందిన రెడీమేడ్ నేతలు, కార్యకర్తలను దూరంగా ఉంచడమే మంచిది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…