
కోలీవుడ్ హీరోలు రాజకీయాలలో ప్రవేశించి ముఖ్యమంత్రులు కావచ్చని విజయ్ మరోసారి నిరూపించారు. కానీ విజయ్ కంటే చాలా సీనియర్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్‌లు రాజకీయాలలో రాణించలేకపోవడం ఆలోచింపజేస్తుంది.
రజనీకాంత్ చాలా ఆరాటపడ్డారు కానీ వయసు, ఆరోగ్యం, ఇతర కారణాల వలన రాజకీయ ఆలోచన విరమించుకున్నారు.
కానీ కమల్ హాసన్ ధైర్యం చేసి ఎంఎన్ఎం పార్టీతో రాజకీయాలలో ప్రవేశించి 2021 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. కానీ ఆయనతో సహా పార్టీలో ఒక్కరూ గెలవలేదు. ఆ తర్వాత డీఎంకేకి మద్దతు పలికి రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు. ప్రజాధరణ లేనందున 2026 ఎన్నికలలో పోటీ చేయలేదు.
వారిద్దరి కంటే వయసులో, అనుభవంలో చిన్నవాడైన విజయ్ తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకొని, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎందువల్ల?
అంటే జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ వెంటనే రాజకీయాలలోకి ప్రవేశించి ఉండి ఉంటే, ప్రజలు తప్పకుండా ఆదరించి ఉండేవారేమో? కానీ అయన ధైర్యం చేయలేదు.
కమల్ హాసన్ ధైర్యం చేసినా అయనకున్న సినీ ఇమేజ్ వేరు. 2018 ఆగస్టులో డీఎంకే అధినేత కరుణానిధి మరణించగా, అయన రాజకీయ వారసుడుగా స్టాలిన్ 2024 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించారు.
ఒకవేళ కమల్ హాసన్ అన్నాడీఎంకే-బిజేపిలతో అప్పుడే చేతులు కలిపి ఉండి ఉంటే నేడు ఆయన పార్టీ పరిస్థితి వేరేగా ఉండేదేమో? కానీ అయన కూడా విజయ్‌లాగే ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా ముందుకుసాగి నష్టపోయారు.
కానీ వారికంటే చాలా ఎక్కువ సమస్యలు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్న విజయ్ ఏవిధంగా గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు? అంటే ఆయనకున్న ‘మాస్ హీరో ఇమేజ్’ ప్రధాన కారణం.
తమిళ ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేలు చేసే మూస రాజకీయాలు, మూస పాలనని ప్రజలు రుచి చూశారు. కనుక ఈసారి సరికొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో వచ్చిన విజయ్‌కి అవకాశం ఇచ్చి ఉండవచ్చు.
ముఖ్యంగా విజయ్ బిజేపి ఒత్తిళ్ళకు ఏమాత్రం తలొగ్గకుండా ధైర్యంగా నిలబడి ఒంటరి పోరాటం చేసినందుకు ప్రజలు మెచ్చి టీవీకే పార్టీకి అంత భారీగా సీట్లు ఇచ్చి ఉండవచ్చు. ఈ వాదన నిజమనుకుంటే ఒకవేళ విజయ్ అన్నాడీఎంకే-బిజేపిలతో ముందే చేతులు కలిపితే ప్రజలు ఆయనకు ఇన్ని సీట్లు ఇచ్చి ఉండేవారు కారేమో?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…