Telugu

వైసీపీ కి బీజేపీ అంటే భయమా.? భక్తా.?

మొదటి నుంచి కూడా వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నేతలందరికి బీజేపీ పై ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే అది వైసీపీ భయమా.? లేక భక్తా.? అనేది ఇప్పటికి చర్చనీయాంశమే.

అయితే బీజేపీ లో కూడా కేంద్ర బీజేపీ అంటే వంగి వంగి దండాలు పెట్టే వైసీపీ రాష్ట్ర బీజేపీ తో మాత్రం కాస్త అటు ఇటుగా నడుచుకుంటుంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా వైసీపీ కేవలం కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తూ వారిని ఉద్దేశించి మాత్రమే విమర్శలు చేస్తుంది.

ADVERTISEMENT

ఉదాహరణకు ఏపీ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పై మండిపడే వైసీపీ అదే పార్టీకి చెందిన సోము వీర్రరాజుని కనీసం పల్లెత్తి మాట కూడా అనదు, అనే సాహసం చెయ్యదు. అలాగే టీడీపీ నుంచి బీజేపీ కి షిఫ్ట్ కొట్టిన సీఎం రమేష్, సుజనా చౌదరి మీద విరుచుకుపడే వైసీపీ విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహ రావు వంటి వారి పై నోరు విప్పదు, విప్పలేదు.

అలాగే ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన టీడీపీ మీద విరుచుకుపడే వైసీపీ కూటమి ప్రభుత్వంలో అంతర్భాగమైన బీజేపీ పై మాత్రం పెదవి విరవలేదు. ఇక బీజేపీ కి అత్యంత సన్నిహితుగా ఉండే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యగలిగే వైసీపీ బీజేపీ నేతల పై మాత్రం రాజకీయంగా కూడా విమర్శలు చెయ్యలేదు.

రాష్ట్ర రాజధాని అమరావతి మొదలు, రాష్ట్ర ముఖ్య ప్రోజెక్టులైన పోలవరం వరకు, అలాగే వైసీపీ లిక్కర్ కేసు నుంచి తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి కేసు వరకు అటు టీడీపీ, జనసేన మీద రెచ్చిపోయే వైసీపీ బీజేపీ పై మాత్రం గొంతెత్తలేదు.

కూటమి ప్రభుత్వంలో భాగమైన బాబు, పవన్ ల పై దూకుడుగా ముందుకొచ్చే వైసీపీ బీజేపీ నాయకుల మీద మాత్రం ఆచితూచి అడుగేస్తారు. అయితే తలవంచుకుని చూసి చూడనట్టు ప్రవర్తిస్తుంది, లేదంటే తమలపాకు తో తట్టినట్టు తగిలి తగలని విమర్శలు చేస్తూ తానూ తప్పుకుని, బీజేపీ ని తెప్పిస్తుంది.

నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం లెక్కచేయని ధీరుడిగా, సోనియాను ఎదిరించి వీరుడిగా జగన్ ను ఎలివేట్ చేసిన వైసీపీ, దాని అనుబంధ సాక్షి బీజేపీ విషయంలో జగన్ ఎందుకింత తగ్గి ఉంటున్నారు, వారి అధినాయకత్వానికి ఎందుకంత లొంగి ప్రవర్తిస్తున్నారు అనేది చెప్పగలదా.?

దీనంతటి వెనుక వైసీపీ కి కేసులు అనే భయం ఒకపక్క వెంటాడుతుంటే మరోపక్క బెయిల్లు అనే భక్తి వైసీపీ ని ముందుకు రానివ్వడంలేదా.? అందుకే చట్ట సభలలో బీజేపీ ప్రవేశ పెట్టే బిల్లులకు వైసీపీ బేషరతు మద్దతు పలుకుతుందా.? అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ పై వైసీపీ వేలెత్తి నిందలు వేయలేకపోతుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CBN And PK Active, But Where Is YS Jagan?

The stage is being set for the upcoming local body election in Andhra Pradesh as…

15 minutes ago

Ramayana US Premiere Date Locked: Massive IMAX Trouble

Bollywood's biggest film Ramayana could face a massive setback in the US market, with its…

30 minutes ago