
కూటమి వేసిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ నాడు ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ చివరికి ప్రజలు రచించిన నోట్లు, ఓట్లు, సీట్లు అనే త్రిశూల వ్యూహంలో చిక్కుకుని ప్రతిపక్షానికి కూడా అర్హత సాధించలేకపోయారు.
అయితే నాడు ఎన్నికల కురుక్షేత్రంలో చిక్కుకుని ఘోర ఓటమిని మూటకట్టుకున్న వైసీపీ నేడు అమరావతి అనే పద్మవ్యూహంలో కూరుకుపోతుంది. తెలిసి చేస్తుందో, తెలియక చేస్తుందో, లేక సలహాదారుల సలహాలతో దారి తప్పుతుందో అర్ధం కావడం లేదు కానీ అమరావతి విషయంలో వైసీపీ ఖచ్చితంగా తప్పటడుగులు వేస్తూనే వస్తుంది.
నాడు మూడు రాజధానులు అంటూ కథ మొదలు పెట్టిన వైసీపీ 151 నుంచి 11 కి పడింది. ఇక నేడు అమరావతి ‘వేశ్యల నగరం’ అంటూ సాక్షిలో మొదలైన రచ్చ అందుకు వైసీపీ ఇస్తున్న మద్దతు 11 తో ఉన్న వైసీపీ ని ఇంకెంత పతనం చేయనుందో.? అన్న చర్చ జరుగుతుంది.
అసలు వైసీపీ కి అమరావతి పై ఎందుకంత కక్ష్య.? అది రాజధాని మీద ఉన్న ద్వేషమా.? లేక రాష్ట్రం మీద ఉన్న విద్వేషమా.? ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి పడినపుడు అమరావతి పై పనికట్టుకుని ఎందుకింత విషాన్ని చిమ్ముతుంది.? ఈ విధంగా నిత్యం ఒక రాష్ట్ర రాజధాని పై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందా.?
ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందా.? రాష్ట్రం ఆర్థికంగా ఎదగగలుగుతుందా.? పొరుగు రాష్ట్రాలతో పోటీ పడగలుగుతుందా.? పెట్టుబడులను ఆహ్వానించగలుగుతుందా.? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం వెతికే ప్రయత్నంలో రాష్ట్ర వినాశనం జరగాలన్నదే వైసీపీ రాజకీయ వ్యూహమా.?
రాష్ట్రంలో వచ్చే అధికార అనిశ్చతి రాష్ట్ర భవిష్యత్ ను ప్రభావితం చెయ్యగలదు. వైసీపీ కావాల్సింది ఇదేనా.? అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పై నియంత మాదిరి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్షంలోకి రాగానే ఉన్మాదిలా అసత్యప్రచారాలు చేయడంతో వైసీపీ అమరావతి అనే పద్మవ్యూహంలో చిక్కుకుని తన ఫ్యాన్ రెక్కలను పూర్తిగా విరుచుకోబోతుందా అనిపిస్తుంది.
కొమ్మినేని మౌనానికి, సజ్జల గారి రాక్షసులు, పిశాచాలు, సంకర తెగ మాటలకు వైసీపీ మద్దతు తెలపడం అంటే అది అమరావతిలో వైసీపీ భవిష్యత్ కి సమాధి కట్టడమే అవుతుంది. సాక్షి విలేకరు నుంచి వైసీపీ ముఖ్య నాయకుడు వరకు ఇలా నిత్యం అమరావతి మానియా లోనే ఎందుకు ఉంటున్నారు. అమరావతి అభివృద్ధి చెందితే అన్న ఊహే వైసీపీ ని ఈ స్థాయికి దిగజారుస్తుందా.?
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…
Mahira Sharma gives the all black trend a fresh, flirtatious spin with a fitted crop…