Telugu

అన్ని అరెస్టులు అధికారాన్ని ఇవ్వలేవు..!

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ కేటీఆర్ అరెస్టు జరిగితే ఆ అరెస్టు బిఆర్ఎస్ ను నిలబెడుతుందా.? కాంగ్రెస్ ను పడగొడుతుందా.? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జరుగుతుంది.

కేటీఆర్ అరెస్టు జరిగితే గతంలో ఏపీలో బాబు అరెస్టుతో టీడీపీ కి అధికారం దక్కినట్టు ఇక్కడ కేటీఆర్ అరెస్టుతో బిఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తుందని, అలాగే దాని పర్యవసానంగా అక్కడ ఏపీలో వైసీపీ పతనమైనట్టు ఇక్కడ కాంగ్రెస్ పాతాళానికి పడుతుంది అనే ఆలోచన బిఆర్ఎస్ లో నడుస్తుంది.

ADVERTISEMENT

అయితే అందుకు రేవంత్ సాహసిస్తారా.? బిఆర్ఎస్ కు ఆ అవకాశం ఇస్తారా.? అంటే ఖచ్చితంగా ఇవ్వరు అంటున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనను అరెస్టు చేసే సాహసం రేవంత్ సర్కార్ చెయ్యదంటూ ఖరాకండిగా చెపుతున్నారు కేటీఆర్.

అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఆ కేసులో తన తప్పేమీలేదని, ఆ సంగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కూడా తెలుసునని, అందుకే ఈ కేసులో రేవంత్ సర్కార్ ముందుకెళ్లలేకపోతుందంటూ పేర్కొన్నారు కేటీఆర్.

అయితే నిజంగా కేటీఆర్ అరెస్టు జరిగితే తెలంగాణలో రాజకీయంగా కుదలైన బిఆర్ఎస్ పార్టీకి తిరిగి జీవం వస్తుందా.? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షానికొస్తుందా.?

కేటీఆర్ అరెస్టుతో బిఆర్ఎస్ పై ప్రేమ, కేసీఆర్ కుటుంబం పై సానుభూతి వస్తాయా.? అంటే కవిత అరెస్టుతో బిఆర్ఎస్ రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నదే తప్ప రాజకీయంగా ఏ మాత్రం లబ్ది పొందలేదు. ఒకరకంగా కవిత అరెస్ట్ అంశం బిఆర్ఎస్ ను ఈ పరిస్థితులలోకి నెట్టిందనే చెప్పాలి.

కవిత అరెస్టుతో మొదలైన బిఆర్ఎస్ పతనం కేటీఆర్ అరెస్టు తో ముగుస్తుంది అనుకోవడం బిఆర్ఎస్ అత్యాశే కావచ్చు. ఒకేవేళ కేటీఆర్ అరెస్టు ను కూడా తెలంగాణ సమాజం న్యాయమని భావిస్తే బిఆర్ఎస్ పతనం ఇంకాస్త బలంగా ఉంటుంది అనేది గ్రహించాలి.

ఎవరైనా రాజకీయ నాయకుడి అరెస్టు ప్రక్రియ అనేది ప్రత్యర్థి పార్టీల రాజకీయ కక్ష్య సాధింపు లో భాగం అని ప్రజలు విశ్వసించిన రోజునే ఆ పార్టీకి ప్రజలలో బలం పెరుగుతుంది, అలాగే ఆ నాయకుడి పట్ల సమాజంలో సానుభూతి కలుగుతుంది.

అంతే తప్ప ప్రతి అరెస్టు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. ఆ నాయకుడిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించలేదు. అలాగే నాడు బాబు అరెస్టు అన్యాయమంటూ జనసేన కూడా బలంగా ప్రచారం చేసింది. అలాగే ఆ ఇరు పార్టీల అభిప్రాయానికి బీజేపీ మద్దతు పలికింది.

ఇలా అటు ప్రజలతో పాటు ఇటు ఇతర పార్టీల నాయకులు కూడా బాబు అరెస్టు ఖండించారు, టీడీపీ కి మద్దతు పలికారు. కానీ ఇక్కడ బిఆర్ఎస్ విషయంలో తెలంగాణలో ఆ పరిస్థితి ఉంటుందా.? బిఆర్ఎస్ కి మద్దతు పలికేందుకు అటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ ముందుకొస్తాయా.?

అంతెందుకు ఒకవేళ కేటీఆర్ అరెస్టే జరిగితే బిఆర్ఎస్ కు అత్యంత సన్నిహిత పార్టీ వైసీపీ ఆ అరెస్టు ఖండించగలదా.? దాని వల్ల బిఆర్ఎస్ కు ఎటువంటి రాజకీయ ప్రయోజనమైన లభిస్తుందా.? కానీ వైసీపీ కి మాత్రం ఏపీలో రాజకీయంగా అది ఓ పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. కాబట్టి వైసీపీ కూడా బహిరంగా బిఆర్ఎస్ కు మద్దతు తెలిపే సాహసం చెయ్యలేదు.

కాబట్టి బాబు అరెస్టు ను కేటీఆర్ అరెస్టు తో ఉహించి ఇప్పుడే రాజకీయ అంచనాలు వేయడం అవివేకమే అవుతుంది. రాజకీయాలలో ఎప్పుడు శత్రువులే కాదు మిత్రులు కూడా ఉండాలి అనేది అందుకేనేమో బహుశా..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After 3 Years, NTR Makes a Surprise Call

A phone call after three years has suddenly got the industry curious. Writer Kona Venkat…

4 minutes ago

విజయసాయి పార్టీ ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి.. ఎలా ఆడుతుందో?

సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌ చేసే వరకు పాటలు, టీజర్‌, ట్రైలర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు అంటూ వీలైనంతగా…

6 minutes ago