ఒక్క ఛాన్స్ తాలూకా విధ్వంశాలు.!మరో ఛాన్స్ ఇస్తారా?

రాష్ట్రంలో వైసీపీ నేతల అనుచరుల దాడులు రోజురోజుకి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. పుంగనూరు ఘటనలో టీడీపీ మద్దతుదారుల పై వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి అనుచరుడి సూరి దౌర్జన్యం, కావలి సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వైసీపీ నేతల దాష్టికం, అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మార్వో ఆఫీస్ ఉద్యోగి మీద స్థానిక వైసీపీ నేతల అనుచరులు అనిల్ రెడ్డి, సునీల రెడ్డిలా దుర్మార్గాలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి.

వైసీపీ ప్రభుత్వంలో వెలుగులోకి వచ్చిన ఉదంతాలకే ఇంతవరకు బాధితులకు సరైన న్యాయం అందించలేని పరిస్థితులలో అధికారులు ,వ్యవస్థలు పనిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ నేతల అనుచరుల దాడిలో మరో ఉద్యోగి భాదితుడిగా మారిన వైనం సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడిగా చెలామణి అయ్యే ఓవ్యక్తి బ్యాంకులో పనిచేసే ఉద్యోగి పై తన ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాలలో షేర్ అవుతుంది.

ADVERTISEMENT

నా గురించి నీకు తెలియదు, బ్యాంకు మొత్తం పగలగొట్టి సెంటర్ లో కూర్చుంటా, నా గురించి కొండపల్లి స్టేషన్ లో కానీ జిల్లాలో కానీ అడుగు నా చరిత్ర మొత్తం చెపుతారు, ఎవరో గొట్టం గాడు ఫోన్ చేసి చెపితే ఆ మాట మాకు చెపుతావా, అసలు ఎవరు నువ్వు, నీ డ్యూటీ ఏంటి…అంటూ ఇంకా వైసీపీ పార్టీ అధికార భాషకు పని చెప్పారు సదరు వైసీపీ అనుచరుడు.

ఇలా పార్టీని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మీద, ఆయా పార్టీల కార్యాలయాల మీద, తమ మాటకు,చేతకు అడ్డు చెప్పిన ఉద్యోగులపైనా అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు దాడికి ఎగబడితే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతున్నట్లేనా? అధికారం ఉందికదా అని ప్రతివాడు తమ బానిసై అన్నట్లు వైసీపీ నేతల ఆలోచన సరళి మారిపోయింది.ఇలా బెదిరించి, భయపెట్టి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో అధికార పార్టీ నేతలు.

ఒక్క ఛాన్స్ విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఏపీ ప్రజలు జగన్ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇస్తారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. ఇన్నాళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని బాధపడే ప్రజలు ఇక నుండి పెరిగిన దాడులు తగ్గితే చాలానే పరిస్థితికి చేరుకుంటారని హెచ్చరిస్తున్నారు ప్రజాస్వామ్య వాదులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

16 minutes ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

1 hour ago