
ఇప్పటివరకు యూ ట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ 4 మిలియన్ క్లిక్స్ దాటి అందుకోవడంతో… ఈ సినిమా చెర్రీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ – గీత ఆర్ట్స్ కాంభినేషన్ లో వచ్చిన “మగధీర” సృష్టించిన రికార్డులే చెర్రీ కెరీర్ లో బెస్ట్. అయితే మళ్ళీ ఇదే కాంభినేషన్ లో డిసెంబర్ 9వ తేదీన విడుదల కానున్న “ధృవ” అదే స్థాయిలో రికార్డులను కొల్లగొడుతుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ అందించిన పాటలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ట్రైలర్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై నమ్మకాలను పెంచింది. ‘రేసుగుర్రం’ ద్వారా అప్పటికి బన్నీ కెరీర్ లో భారీ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి, చెర్రీకి కూడా అదే ట్రాక్ రికార్డును కొనసాగిస్తాడో లేదో డిసెంబర్ 8వ తేదీన ప్రదర్శితం కానున్న ప్రీమియర్ షోలతో తెలిసిపోనుంది.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…