Telugu

ఏపీ, తెలంగాణలపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఉంటుందా?

ఈసారి కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలపై సర్వీలు చేసిన వివిద మీడియా సంస్థలన్నీ లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని ముక్తకంఠంతో తేల్చి చెపుతున్నాయి. అదీ… భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేస్తున్నాయి. సర్వే రిపోర్టులు:

ADVERTISEMENT

మరో ఏడాదిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తర్వాత ఒకటి రెండు నెలల వ్యవధిలోనే ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. దాంతో బాటే లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిజెపికి గెలుపు చాలా అవసరం. కానీ సర్వేలన్నీ బిజెపి ఓడిపోతుందని సూచిస్తున్నాయి. అదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా చేజారిపోతుంది. ఈ ఓటమి ప్రభావం తప్పకుండా తెలంగాణ రాజకీయాల మీద, ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలమీద చాలా ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోతే, జాతీయ రాజకీయాలలో ప్రవేశించి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తహతహలాడుతున్న కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టవచ్చు. అలాగే మోడీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌, మిత్రపక్షాలు కూడా గట్టిగా ప్రయత్నించవచ్చు.

ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపవచ్చు. ఈ ఎన్నికలలో బిజెపి గెలిస్తేనే దాంతో జనసేన పొత్తులు కొనసాగించవచ్చు. ఒకవేళ ఓడిపోతే టిడిపితో చేతులు కలపవచ్చు. విధిలేని ఈ పరిస్థితులలో బిజెపి కూడా వాటితో చేతులు కలపవచ్చు లేదా సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు వాటి కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉపయోగపడుతుందని నమ్మితే దానికి పరోక్షంగా అవసరమైన సహాయసహకారాలు అందించవచ్చు. అదే జరిగితే సిఎం జగన్‌ రొట్టె విరిగి నేతిలో పడిన్నట్లే. కనుక కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ముందుగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కరోనా వైరస్‌లా మన ఎన్నికల హామీలు అమెరికాకు పాకాయా?

కరోనా వైరస్ చైనాలో పుట్టి యావత్ ప్రపంచ దేశాలకు వ్యాపించి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. అదేవిధంగా,…

7 minutes ago

GG’s Favourite Out of T20I Squad? Yash Replaces Him

Harshit Rana has been ruled out of India’s upcoming T20I series against Afghanistan and the…

29 minutes ago