మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వివాహ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారా? లేదా? అన్న అంశం అభిమానుల్లో ఆసక్తి కరిగించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా పాటల చిత్రీకరణలో ఉండడంతో మెగా వేడుకకు వస్తారా… రారా… అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ప్రశ్నలకు దాదాపుగా స్పష్టత వచ్చేసింది.
తొలుత ఈ వేడుక కోసం ఒక రోజు బ్రేక్ తీసుకుని పవన్ హాజరు అవుతారని చెప్పినప్పటికీ, ప్రస్తుతం కుదరక రావడం లేదన్న సమాచారం వచ్చింది. దీంతో చిరంజీవి ఇంట వేడుకకు మెగా బ్రదర్ దూరంగా ఉండడం ఖాయమైంది. బెంగుళూరులో జరగబోయే వివాహ వేడుకకు హాజరు కాకపోయినప్పటికీ, 31వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ కైనా హాజరవుతారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది
ADVERTISEMENT
ADVERTISEMENT





