షర్మిలకి రేవంత్ అండ ఉన్నట్టా? లేనట్టా?

తెలంగాణ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి నిశ్చయించుకున్నాను అంటూ ప్రకటించిన షర్మిల ప్రకటనలు నేటికీ వాస్తవ రూపంలోకి వచ్చాయి. నేడు హస్తినలో రాహుల్ సమక్షంలో YSRTP ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల కాంగ్రెస్ అధిష్ఠానము ఆదేశాలను బాధ్యతగా స్వీకరిస్తాను అంటూ బారి స్టేట్మెంట్ ఇచ్చారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తమ పార్టీ పాత్ర, తన త్యాగం ఉందంటూ చెప్పిన షర్మిల కాంగ్రెస్ గెలుపుని ఆహ్వానించింది కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ ని అంగీకరించలేకపోయారు. రేవంత్ రెడ్డిని దొంగ, రేటెంత రెడ్డి అని విమర్శించే వారు వేరేవున్నారు. ఏదేమైనా దొంగలు ముఖ్యమంత్రులుగా కాకూడదనే కోరుకుంటున్న అంటూ పరోక్షంగా రేవంత్ కు కౌంటర్ వేసిన షర్మిల. ఇప్పుడు తోటి కాంగ్రెస్ నాయకుడిగా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గా తన రాజకీయ ఎదుగుదలకు షర్మిల రేవంత్ సాయం కోరుకుంటుందా..? అనే సందేహాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT

అలాగే గతం నుంచి కూడా తన పై టీడీపీ ముద్ర వేసి చంద్రబాబు తొత్తు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన షర్మిలకు రేవంత్ తన సహకారాన్ని అందిస్తాడా..? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే కార్యక్రమానికి రేవంత్ కు ఆహ్వానం రాలేదో, లేక ఆయనే హాజరుకాలేదు కానీ రేవంత్ ఆసమయం లో ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయినా షర్మిల చేరికకు చేరువకాలేదు. దీనితో రేవంత్ షర్మిలకు సహకరిస్తారా అనే ప్రశ్న మరింత బలపడింది.

“జగనన్న వదిలిన బాణంగా” రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు “జగనన్న పై ఎక్కుపెట్టిన బాణంగా” 2024 లో జరిగే ఏపీ ఎన్నికలలో తానూ పాదయాత్ర చేసి గెలిపించిన వైసీపీ పార్టీని తన చేతులతో కాలరాయడానికి కూడా వెనుకడుగు వేసేలా లేరు. మరి ఈ ప్రయాణంలో వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి రేవంత్, షర్మిల పరస్పర సహకారం అందిపుచ్చుకుంటారో లేదో అనేది రానున్న రోజులలో తేలిపోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Irumudi Success Changes Ravi Teja’s Next Move?

Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…

12 minutes ago

Chakkora: ‘Addamla Cheyana’ Song Launched by MP CM Ramesh

The makers of Chakkora – Lunar Love Bird have unveiled their first single “Addamla Cheyana,”…

21 minutes ago